Garuda Purana,Lord Vishnu Niti : స్వర్గం, నరకం గురించి తరచుగా చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ స్వర్గం  నరకం మీ అదృష్టంపై ఆధారపడి ఉండవని, కర్మపై ఆధారపడి ఉంటాయని మీకు తెలుసా? ఒక వ్యక్తి జీవితంలో మంచి - చెడు రెండు సంఘటనలూ చాలా జరుగుతాయి. వీటిని మనం విధిరాత అనేస్తారు.  కానీ మరణం తర్వాత పరిస్థితి అదృష్టంపై ఆధారపడి ఉండదు, మీ కర్మపై ఆధారపడి ఉంటుంది. అందుకే, మరణం తర్వా వ్యక్తి స్వర్గ సుఖాన్ని పొందుతాడా లేదా నరక బాధను అనుభవిస్తాడా అనేది కూడా తను చేసే కర్మలపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. 

Continues below advertisement


స్వర్గం-నరకం ..అదృష్టంపై ఆధారపడి ఉండదు, కర్మతో ముడిపడి ఉంటుంది.


ఎలాంటి కర్మలు చేసిన వారికి స్వర్గం లభిస్తుంది?


 ఎలాంటి కర్మలు చేసిన వారికి నరకం లభిస్తుంది? 


దీనికి సమాధానం మీకు గరుడ పురాణంలో లభిస్తుంది...


హిందూ ధర్మంలోని అష్టాదశ పురాణాలైన 18 మహాపురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో భాగమైన ప్రేతఖండంలో స్వర్గం, నరకం గురించి ఉంది.  ఈ విషయంలో శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన గరుత్మంతుడికి వివరంగా చెప్పారు. గరుడ పురాణంలో స్వర్గం, నరకం గురించి శ్రీ మహావిష్ణువు ఏమన్నారో తెలుసుకుందాం.


ఇలాంటి కర్మలు స్వర్గానికి మార్గం తెరుస్తాయి


గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం.. తమ ఇంద్రియాలను నియంత్రించుకుని కోపం, భయం , దుఃఖాన్ని తమపై ఆధిపత్యం చెలాయించని వారికి మరణానంతరం స్వర్గం లభిస్తుంది.


స్త్రీల పట్ల మనస్సులో వాంఛలను కలిగి ఉండని పురుషులు. స్త్రీలను చూసినప్పుడు ఎవరి మనస్సు చలించదో .. ఇతర స్త్రీలను తల్లి, సోదరి , కుమార్తెగా భావిస్తారో .. అదే దృష్టితో చూస్తారో, అలాంటి వారికి కూడా స్వర్గానికి మార్గం లభిస్తుంది.


గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు.. ఇతరుల వ్యక్తిత్వంలోని మంచి లక్షణాలను చూసి మెచ్చుకునే వారికి కూడా స్వర్గంలో స్థానం లభిస్తుంది.


గరుడ పురాణం ప్రకారం, తన జీవితంలో బావి, ధర్మశాల, చెరువు, ఆలయం లేదా ఆశ్రమం మొదలైనవి నిర్మించే లేదా వాటికి సహకరించే వ్యక్తికి మరణానంతరం నరకం రాదు.


ఇలాంటి కర్మలు చేసిన వారు నరక బాధలను అనుభవిస్తారు


గరుడ పురాణం ప్రకారం, పేదలు, నిస్సహాయులు, అనాథలు, రోగులు, వృద్ధులను ఎగతాళి చేసేవారు లేదా అవమానించేవారు కచ్చితంగా నరక బాధలను అనుభవిస్తారు.


గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు, భగవంతుడిని , తమ పూర్వీకులను పూజించని వారు కూడా నరకానికి వెళ్ళాలి. అంతేకాకుండా, అలాంటి వారు నరకంలో హింసను కూడా అనుభవించవలసి ఉంటుంది.


లోభం, స్త్రీలను చంపేవారు, ఇతరుల ఆస్తులను దోచుకునేవారు, అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, బాలికలను అమ్మేవారు, అసూయతో ఉండేవారు మొదలైన వారు మరణం తరువాత యమదూతలచే నరకానికి వెళతారు.


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం. ABP దేశ ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.


Karthika Masam 2025 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!