Brahmamudi Serial Today Episode: దీక్ష చేస్తున్న రాజ్‌ను ఇందిరాదేవి సపోర్టు చేస్తుంది. దీంతో రాజ్‌కు డౌటు వస్తుంది. ఇన్ని రోజులు నువ్వు ఆ కళావతిని సపోర్టు చేశావు ఇప్పుడేంటి నాకు సపోర్టు చేస్తున్నావు అని అడుగుతాడు.

Continues below advertisement

ఇందిరాదేవి: నీ గురించి రాత్రే తెలిసిందిరా అందుకే నీకు సపోర్టు చేస్తున్నాను.. నువ్వు ఎలాగైనా కావ్యను ఒప్పించి ఇంటికి తీసుకురావాలి

రాజ్: ఇన్ని రోజులు ఒక్కడిని ఉంటేనే తగ్గలేదు.. ఇప్పుడు నీ సపోర్టు దొరికి ఇద్దరు అయ్యాము ఇక తగ్గుతానా..? కావ్యను తీసుకుని వస్తాను

Continues below advertisement

అని చెప్పగానే.. సరే అటూ వెళ్దాం పద అంటుంది. ఇక రాహుల్‌ తన కారు డిక్కీ ఓపెన్‌ చేసిన తాను తీసుకొచ్చిన క్రాకర్స్‌ చూపిస్తాడు.

రుద్రాణి: ఓరేయ్‌ ఇవి  పని చేస్తాయి కదా

రాహుల్‌: పని చేయడం కాదు మామ్‌ ఏకంగా పైకే పంపిస్తాయి. నువ్వు చెప్పిన పౌడర్‌తో స్పెషల్ గా దగ్గరుండి చేయించాను. ఈ క్రాకర్స్‌ కాల్చినప్పుడు దాని స్మోక్‌ కానీ లోపలికి పోయిందనుకో.. అంతే చాలు బ్రీతింగ్‌ ఆగిపోతుంది. కళ్లు తెరవకుండానే కావ్య కడుపులో ఉన్న బిడ్డ కాటికి పోతుంది.

రుద్రాణి: వెరీగుడ్‌ రాహుల్‌.. మనకు కావాల్సింది అదే కదా..? ఈరోజు ఎలాగైనా సరే ఆ కావ్య చేత ఈ క్రాకర్స్‌ అన్ని కాల్పించాల్సిందే.. కానీ ఎలా..?

అంటూ ఆలోచిస్తున్న రుద్రాణికి స్వరాజ్‌ కనిపిస్తాడు.

రుద్రాణి: స్వరాజ్‌ నువ్వు క్రాకర్స్‌ కాలుస్తావా..?

స్వరాజ్‌: ఓ ఎందుకు కాల్చను కానీ ఎక్కడున్నాయి క్రాకర్స్‌..

రుద్రాణి: నా దగ్గర బోలెడు ఉన్నాయి.. కానీ అవి నువ్వు కాల్చాలి అంటే కొన్ని కండీషన్స్‌ ఉన్నాయి.. అవి నువ్వు నైట్‌ మాత్రమే కాల్చాలి. అది కూడా నువ్వు మీ కావ్య అత్తయ్యతో మాత్రమే కాల్చాలి.

స్వరాజ్‌: ముందు క్రాకర్స్‌ ఎక్కడున్నాయి చెప్పండి

రుద్రాణి.. స్వరాజ్‌ను కారు దగ్గరకు తీసుకెళ్లి క్రాకర్స్‌ చూపిస్తుంది.

స్వరాజ్‌:  ఇవి నాకొద్దు లాస్ట్‌ టైం అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు నన్ను నువ్వు తిట్టావు అందుకే నేను తీసుకోను.. నేను మా మామయ్య వెళ్లి మీకన్నా ఎక్కువ క్రాకర్స్‌ తెచ్చుకుంటాము

అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు స్వరాజ్‌.

రాహుల్‌: మమ్మీ నువ్వు వెంటనే వెళ్లి జ్యోతిష్యుడిని కలువు

రుద్రాణి: ఎందుకురా

రాహుల్‌: నీ టైం బాగా లేనట్టు ఉంది మమ్మీ.. ఆ బుడ్డోడు కూడా నీకు వ్యాల్యూ ఇవ్వడం లేదు.. పైగా నువ్వు ఏ ప్లాన్‌ చేసినా ఇదిగో ఇలాగే అట్టర్‌ ప్లాప్‌ అవుతుంది.

రుద్రాణి: ఇది కూడా మన మంచికే జరిగింది రాహుల్‌

రాహుల్‌: ఇలాంటి దరిద్రం కూడా మంచి కోసమే ఎలా జరుగుతుంది మమ్మీ

రుద్రాణి: ఇప్పుడు ఇవి ఆ స్వరాజ్‌ గాడు కాలిస్తే.. ఆ నింద మన మీదకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ రాజ్‌ తెచ్చే క్రాకర్స్‌లో ఇవి కలిపేద్దాం.. అంతే మన మీదకు నింద రాకుండా పని అయిపోతుంది

రాహుల్: సూపర్ ఐడియా మామ్‌..

అనగానే ముందు నువ్వు ఆ క్రాకర్స్‌ ఎలా కలపాలో ఆలోచించు అని చెప్తుంది. మరోవైపు కనకం తెచ్చిన కొత్త బట్టలు రాజ్ కు ఇచ్చేందుకు కావ్య, ఇందిరాదేవితో కలిసి నాటకం ఆడుతుంది. దీంతో రాజ్‌ కొత్త బట్టలు తీసుకుని వేసుకుంటాడు. తర్వాత స్వరాజ్‌ వచ్చి రాజ్‌తో క్రాకర్స్‌ కొందామని చెప్తాడు. ఇద్దరూ కలిసి వెళ్లి క్రాకర్స్‌ తీసుకొస్తారు. రాత్రికి అందరూ కలిసి క్రాకర్స్‌ కాలుస్తుంటారు. దూరం నుంచి రుద్రాణి, రాహుల్‌ దొంగ చాటుగా చూస్తుంటారు. ఇంతలో రుద్రాని వాళ్లు కలిపిన క్రాకర్స్‌ తీసుకుని కాల్చడానికి అప్పు వస్తుంది. అది చూసిన రుద్రాణి, రాహుల్‌ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!