గణేష్ చతుర్థి 2026: గణేషుడి 32 రూపాలు జీవితంలో వివిధ అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. వీటిని ఆరాధించడం , భక్తితో పూజించడం ద్వారా జీవితంలో శ్రేయస్సు, జ్ఞానం, శక్తి, విజయం లభిస్తాయని భక్తుల విశ్వాసం.  బాల గణపతి 

Continues below advertisement

బంగారు రంగులో ఉన్న బాల స్వరూపం బాల గణపతి. న చేతుల్లో అరటి, మామిడి, చెరకు , పనసతో దర్శనమిస్తాడు. ఇష్టమైన మోదకం తొండంలో  ఉంటుంది తరుణ గణపతి

అష్టభుజాలతో తరుణ గణపతి రూపం... పాశం , అంకుశం, మోదకం, గంట, విరిగిన దంతం, వరి కాండం , చెరకును ధరించి పూజలందుకుంటాడు. ఈ రూపంలో మెరిసే గణపతి ఎర్రటి రంగు యవ్వనానికి చిహ్నం భక్తి గణపతి

Continues below advertisement

పున్నమి చంద్రుడిలా మెరుస్తూ పూలమాలలతో అలంకరించి భక్తులకు అత్యంత ప్రియమైన రూపంలో దర్శనమిస్తాడు భక్తి గణపతి. ఈ రూపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. చేతుల్లో అరటి, మామిడి, కొబ్బరికాయతో పాటూ పాయసం గిన్నె ఉంటుంది వీర గణపతి

విధేయతతో కూడిన ముద్రను కలిగి దర్శనమిస్తాడు వీర యోధుడు వీర గణపతి. ఆయన 16 భుజాలు మనసుకి  సంబంధించిన శక్తుల చిహ్నంగా ఆయుధాలతో అలంకరించి కనిపిస్తాడు. ఈ రూపంలో అంకుశం, చక్రం, ధనుస్సు, బాణం, కత్తి, డాలు, బల్లెం, గద,  గొడ్డలి, త్రిశూలం సహా ఎన్నో ఆయుధాలు ధరించి దర్శనమిస్తాడు శక్తి గణపతి

నారింజ-ఎరుపు రంగులో కనిపించే శక్తి గణపతి గృహస్థులను రక్షించే స్వామిగా  దండ, పాశం,  అంకుశం ధరించి అభయ ముద్రతో ఆశీర్వదిస్తాడు.  

ద్విజ గణపతి

నాలుగు ముఖాలతో..వెలుగుతున్న చంద్రుడిలా కనిపిస్తాడు ద్విజ గణపతి. పాశం, అంకుశం, వడగళ్ళతో చేసిన శాస్త్రం, దండం, జలపాత్ర , జపమాల ధరించి క్రమశిక్షణతో ఉండేలా శక్తిని అందించే రూపం ఇది సిద్ధి గణపతి

బంగారు వర్ణంలో ఉన్న ఈ గణపతి... సిద్ధి ,ఆత్మ-నియంత్రణకు చిహ్నంగా భావిస్తారు భక్తులు. పూల గుత్తి, గొడ్డలి, మామిడి, చెరకు , తొండంలో   నువ్వుల మిఠాయిలతో ప్రశాంతంగా కనిపిస్తాడు ఉచ్చిష్ట గణపతి

ఆశీర్వాదం ఇచ్చే రూపం ఉచ్చిష్ట గణపతి. నీలం రంగులో ఆరు భుజాలు కలిగి చేతుల్లో వీణ, దానిమ్మ, నీలి కలువ , జపమాల , వరి కాండంతో దర్శనమిస్తాడు. సంస్కృతికి పోషకుడుగా ఈ రూపాన్ని పూజిస్తారు విఘ్న గణపతి

అడ్డంకులు తొలగించే దేవుడు విఘ్న గణపతి. రత్నాలతో అలంకరించిన రూపంలో..ఎనిమిది భుజాల్లో పాశం , అంకుశం, దంతం , మోదక్, శంఖం ,చక్రం, పూలు, చెరకు, పుష్పబాణం  గొడ్డలితో కనిపిస్తాడు

క్షిప్ర గణపతి

కోర్కెలు నెరవేర్చే రూపం క్షిప్రగణపతి. సుందరమైన, ఎరుపు రంగులో ఉన్న ఈ రూపంలో .. విరిగిన దంతం, పాశం, అంకుశం , కల్పవృక్షం   కాండంతో దర్శనమిస్తాడు. తొండంలో రత్నాలతో నిండిన చిన్న కలశంతో కనిపిస్తాడు గణనాథుడు హేరంబ గణపతి

ఐదు ముఖాలతో శ్వేత వర్ణం కలిగిన ఈ రూపం బలహీనులకు రక్షకుడు. పెద్ద సింహంపై స్వారీ చేస్తూ  పాశం, జపమాల, గొడ్డలి, సుత్తి, దంతం, దండ, పండ్లు, మోదక్ ధరించి రక్షకుడిగా దర్శనమిస్తాడు.  లక్ష్మీ గణపతి

బుద్ధి , సిద్ధిలతో కూడి భక్తులకు దర్శనమిస్తాడు లక్ష్మీ గణపతి . వరద ముద్రలో చిలుక, దానిమ్మ, పాశం, కల్పవృక్షం కాండం ,కత్తి, అంకుశం,  జలపాత్రతో దర్శనమిస్తాడు

మహా గణపతి

ఎరుపు రంగు , మూడు కళ్ళతో కనిపించే ఈ రూపంలో.. దంతం, దానిమ్మ, నీలి కలువ, చెరకు, ధనుస్సు, చక్రం, పాశం, కమలం, వరి కాండం, గద , రత్నాలతో నిండిన కలశాన్ని ధరించి అభయాన్నిస్తాడు

విజయ గణపతి

నాలుగు భుజాలతో ఎరుపు రంగులో  సాధన సంపత్తి కలిగిన మూషికంపై స్వారీ చేస్తూ దర్శనమిచ్చే విజయ గణపతిని విజయాన్ని ఇచ్చేవాడుగా పూజిస్తారు. విరిగిన దంతం, ఏనుగు అంకుశం, పాశం , బంగారు మామిడితో దర్శనమిస్తాడు విజయ గణపతి నృత్య గణపతి

నాలుగు భుజాలతో, బంగారు రంగులో దర్శనమిస్తాడు నృత్య గణపతి. వేళ్ళనిండా ఉంగరాలతో, దంతం, అంకుశం, పాశం , మోదక్ చేతపట్టుకుని పూజలందుకుంటాడు. కల్పవృక్షం కింద నృత్యం చేస్తూ కనిపించే ఈ రూపం ఆనందానికి చిహ్నం ఊర్ధ్వ గణపతి

శక్తిని మొత్తం ఎడమ మోకాలిపై ధరించి బంగారు కాంతిలో వెలిగిపోతాడు ఊర్థ్వ గణపతి. ఆరు చేతుల్లో వరికాండం, కమలం, చెరకు ధనుస్సు, బాణం, దంతం, నీలి కలువతో దర్శనమిచ్చే రూపం ఇది

గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

పండుగల విశిష్టతలు, రామాయణం, మహాభారతం, చాణక్యనీతి, గరుడపురాణం, నమ్మకాలకు సంబంధించిన ఆధ్యాత్మిక సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి