గణనాధులను నిమజ్జనానికి తరలించే ముందు మండపాల వద్ద లడ్డు వేలం పాటలు నిర్వహించడం ఆనవాయితీ. ఎన్నో ఏళ్లుగా ఉత్సవ నిర్వహకులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈసారి పాట మారింది. కొత్త ఓరవాడికి శ్రీకారం చుడుతున్నారు. కొన్ని చోట్ల లక్కీ డ్రా తీస్తుండగా మరికొన్ని చోట్ల వేలం పాట పాడుతున్నారు. గణనాధుల నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో లడ్డు లక్షలలో కొందరు వేలంపాటల్లో దక్కించుకున్నారు.
గణేష్ ఉత్సవాల్లో నిమర్జనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో లడ్డుకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూలనుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. లడ్డు ధర ఎంతైనా సరే వేలంపాటలో దక్కించుకుంటారు. అయితే కొందరు ప్రసాదం, లడ్డుతో పాటు బంగారు లడ్డూని ఏర్పాటు చేసి వేలం చేస్తున్నారు.
నల్లగొండలో పాతబస్తీ హనుమాన్ నగర్ లోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద లడ్డు వేలం రికార్డ్ సృష్టించింది. గతేడాది 11 లక్షలు పలికిన ఈ లడ్డు ఈసారి ఏకంగా 36 లక్షల పలికింది. వేలంలో నల్గొండ జిల్లా అంబేద్కర్ యువజన సంఘల అధ్యక్షుడు జయరాజ్ దక్కించుకున్నారు. ఈ వేళలో బిజెపి రాష్ట్ర నాయకుడు వర్షిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు రామరాజు పోటీపడినా కానీ చివరకు జయరాజ్ సొంతం చేసుకున్నారు. రికార్డు స్థాయిలో వేలంలో లడ్డు కొనుగోలు జరగడం వల్ల గణేష్ ఉత్సవ కమిటీ ఆనందం వ్యక్తం చేశారు.
వినాయక చవితి ఉత్సవాలు భాగంగా నిర్మించిన రోజు గణపయ్య లడ్డు వేలం పాటలు ఆకట్టుకున్నాయి. గచ్చిబౌలిలోని భుజ అపార్ట్మెంట్లో లడ్డూ ధర భారీగా పలికింది. ఉన్నతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి చిరంజీవి గౌడ్ వేలంపాటలో 25.50 లక్షలకు లడ్డూని సొంతం చేసుకున్నారు.
పట్టాభిపురంలో మండల మోహన కృష్ణ యూత్ ఆధ్వర్యంలో జెకెసి నగర్ లో జరుగుతున్న గణేష్ ఉత్సవాలు ముగిసాయి. ఇక్కడ గణపతి లడ్డుకు వేళా నిర్వహించగా గోకుల్ 6 లక్షలకు కైవసం చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మనవ మోహనకృష్ణ ఈ లడ్డును గోకుల్ కు అందజేశారు. వినాయకుడి మెడలో 10 వేల దండను, 2,88,888 రూపాయలకు సాయి మాధవ్ దక్కించుకున్నారు. పలకలూరు రోడ్డు లోని జనచైతన్య హ్యాపీ హోమ్స్ వినాయకుని లడ్డు 40 వేల ధర పలికింది దీనిని మహిళలకు ఆవేశం చేసుకున్నారు.
మైదుకూరు పట్టణంలో పాతూరు లోని పెద్దమ్మ దేవత వీధిలో వినాయకుడి మండపం వద్ద సోమవారం రాత్రి వేలంపాట నిర్వహించారు. వేలం పాటలో వినాయక స్వామి లడ్డు 3.25 లక్షల ధర పలికింది. మండలంలోని జంగంపల్లి కు చెందిన సుధీర్ కుమార్ అజయ్ కుమారులు ఇద్దరు కలిసి లడ్డూను దక్కించుకున్నారు.
వినాయక చవితి ఉత్సవాల భాగంగా గణపయ్య బంగారు లడ్డు వేలం విశేషంగా ఆకట్టుకుంది. నారాయణగూడ పరిధిలోని వీధి నెంబర్ ఐదు లో వినాయకుడి చేతిలో ప్రత్యేకంగా తులం బంగారంతో తయారుచేసిన లడ్డూను ఉంచారు. నిమజ్జనం రోజు 15 కిలోల లడ్డుతో కలిపి దీన్ని వేలం వేశారు. 1,116 తో వేలం పాట మొదలు కాగా... హిమాయత్ నగర్ కు చెందిన సంధ్యారాణి 1.36 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం గంగమ్మ ఒడికి గణపయ్య బయలుదేరి వెళ్ళగా భక్తులు ముత్యాలతో సందడి చేశారు.