shakuna shastra: మనతో పాటు, మనకు ప్రత్యక్ష సంబంధం లేని అనేక జీవులు మన ఇంట్లో ఉంటాయి. కొన్నిసార్లు వాటి ఉనికి గురించి మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు వాటి గురించి మనకు ఏమీ తెలియదు. కానీ అవి మన ఇంట్లోనే ఉంటాయి. అలాంటి జీవుల్లో బల్లి ఒకటి. దీన్ని చూసి చాలామంది భయపడతారు. ఇంకొందరు అసహ్యించుకుంటారు. అయితే మీపై బల్లి పడితే దాని ప‌రిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? శకున శాస్త్రం ప్ర‌కారం బల్లి మీ చేతిపై పడితే ఏం జ‌రుగుతుందో తెలుసా..? శ‌రీరంపై బ‌ల్లి ప‌డ‌టం వ‌ల్ల‌ అది మనకు ఎలాంటి సూచన ఇస్తుందో మీరే తెలుసుకోండి.


Also Read : ఇంట్లో బల్లులు ఉండటం మంచిదేనా? తోక ఊడిన బల్లి కనిపిస్తే ఏం జరుగుతుంది?


1. శరీరంపై బల్లిపడితే
శకున శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తిపై బల్లి పడితే, అది శుభసూచకంగా పరిగణిస్తారు. హిందూ నమ్మకాల ప్రకారం, శ‌రీరంపై బల్లి పడితే ధనలాభం క‌లిగే అవకాశాలు ఉన్నాయి. అంటే, అలాంటి వ్యక్తి తన జీవితంలో డబ్బు పొందుతాడని అర్థం. అది శుభసూచకమే కాదు, శరీరంపై బల్లి పడటం వల్ల ఆ వ్యక్తికి సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. అలాంటి వ్యక్తి పట్ల గౌరవం రోజురోజుకూ పెరుగుతుందనే విషయాన్ని ఈ ఉదంతం తెలియజేస్తోంది. మరికొందరి అభిప్రాయం ప్రకారం, శ‌రీరంపై బల్లి పడితే, ఆ వ్యక్తి కొత్త దుస్తులు పొందుతాడు.


2. పురుషుల‌ చేతులపై బల్లి పడితే
శకున శాస్త్రం ప్రకారం, స్త్రీ, పురుషుల శరీరంలోని వివిధ భాగాలపై బల్లి పడటం గురించి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఎడమ చేతిపై బల్లి పడితే, ఆ వ్యక్తి ఆస్తి నష్టాన్ని చవిచూడవచ్చు లేదా ఆ వ్యక్తి  ఆస్తిని మరొకరు స్వాధీనం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి కుడిచేతిపై బల్లి పడితే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.  ఇది అకస్మాత్తుగా డబ్బు రావ‌డానికి సంకేతం. ఈ వ్యక్తి తన జీవితంలో అక‌స్మాత్తుగా చాలా డబ్బు, సంపదను పొందుతాడు.


3. స్త్రీ చేతిపై బల్లి పడితే
శకున శాస్త్రం ప్రకారం, స్త్రీ ఎడమ చేతిపై బల్లి పడితే అది అశుభ సంకేతం. ఫ‌లితంగా ఆమె త‌న‌ ధనాన్ని కోల్పోయే సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మరోవైపు, స్త్రీ కుడి చేతిపై బల్లి పడితే, అది శుభ సంకేతంగా పరిగణిస్తారు. కుడిచేతిపై బల్లి పడటం లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. వారు వ్యాపారంలో చాలా లాభాలను పొందుతార‌ని చెప్పేందుకు ఇది సంకేతమ‌ని పేర్కొంటారు.


Also Read : మన చేతలే మన శత్రువు - మీరు చేసే మంచి పనులను నాశనం చేసే చర్యలు ఇవే


ఇలాంటి సంఘటనలు చాలా మంది జీవితాల్లో జరిగాయి. శరీరంలోని ఏ భాగంపై బల్లిప‌డితే ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో తెలియదా..? మీ జీవితంలో కూడా ఇలాగే ఉంటే, మీరు దాని గురించి తెలుసుకోవడానికి పండితుల‌ సలహా తీసుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనవచ్చు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.