Swami Ramdev On 31st Sanyas Diwas Baba Ramdev: స్వామి రామ్‌దేవ్ 31వ సన్యాస దివస్‌ను హరిద్వార్‌లోని పతంజలి వెల్‌నెస్‌లో యోగా భవన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నవరాత్రి యజ్ఞం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య బాలకృష్ణ స్వామి రామ్‌దేవ్‌కు పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రసగించించిన యోగా గురువు బాబా రాందేవ్ భారతదేశం సనాతన సంస్కృతి, ఋషి-వేద సంప్రదాయం, రాముడు-కృష్ణుడు, ఆదిశక్తి గురించి మాట్లాడారు. మనిషిలో పేరుకుపోయిన చీకటి, అజ్ఞానం, ప్రతికూలత అనే రాక్షసులను జయించి రాముడి లాంటి స్వభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు బాబా రాందేవ్. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం. దుష్టశిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మనిషి రూపంలో భూమిపై అవతరించి ధర్మ సంస్థాపన చేసిన అవతారం ఇది. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నంలో జన్మించాడు దశరథ తనయుడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను సొంతబిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య కోసం పరతపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల సుగుణాలు కలబోసిన రాముడిని షోడస గుణాలను ప్రత్యేకంగా చెబుతారు. భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా రాముడిని చూపిస్తారు. మనిషి అంటే ఇలా బ్రతకాలి అని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. ఈ జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు శ్రీరాముడు. అయనము అంటే నడక అని అర్థం.. రామాయణం అంటే రాముని నడక అని అర్థం. ఆ నడకను అనుసరించాలి, ఆ గుణాలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు బాబా రాందేవ్. తాను సన్యాసిగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సన్యాసి జీవితంలోకి అడుగుపెడుతున్నానని చెప్పారు. సన్యాసికి ఒకే ఒక విధి ఉందని - యోగధర్మం ద్వారా రాష్ట్రధర్మం, సేవాధర్మం, యుగధర్మాన్ని నిర్వర్తించడం, ఈ దేశానికి ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు , సంస్కృతిని అందించడం అని ఆయన అన్నారు. చైత్ర నవరాత్రుల సందర్భంగా నవమి రోజు ప్రత్యేకంగా బాల పూజ చేశారు. ఈ పూజలో పాల్గొన్న బాబా రాందేవ్ బాలికల పాదాలు కడిగి, వారికి తినిపించి, ఆశీర్వాదాలు పొందారు. సాధారణంగా ఆశ్వయుజమాసంలో వచ్చే దసరా నవరాత్రుల్లో బాలపూజ/కౌమారీ పూజ చేస్తారు. అలాగే చైత్ర మాసంలో వచ్చే మొదటి తొమ్మిది రోజులను చైత్ర నవరాత్రులు పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు రోజుకే అలంకారంలో అమ్మవారిని అలంకరించి నవదుర్గలను ఆరాధిస్తారు. ఇందులో భాగంగా బాలపూజ చేశారు బాబా రాందేవ్. బాబా రామ్‌దేవ్ సన్యాసం తీసుకోవడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయం, విలువలకు కీర్తిని అందించారని..భారతదేశ వైభవ సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేశారని ఆచార్య బాలకృష్ణ అన్నారు. సనాతన ధర్మంలో నవరాత్రికి ప్రత్యేక స్థానం ఉంది. తల్లి భగవతి అందరినీ ఆశీర్వదించాలి, ప్రతి ఒక్కరి జీవితంలో శుభం, ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన ప్రార్థించారు. బాల పూజతో మనిషిలో దుర్గుణాలు, దుష్టశక్తులు, చెడు అలవాట్లు, రాక్షస స్వభావాన్ని జయించాలని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర నవరాత్రి భారతదేశ గొప్ప సంస్కృతి , సంప్రదాయంలో ఒక భాగం. దానిని అనుసరించడం మన కర్తవ్యం అని పిలుపునిచ్చారు ఆచార్య బాలకృష్ణ.