Chandra Grahan 2025:  అత్యంత పవిత్రమైనవిగా భావించే వస్తువులలో...తులసి, ధర్భలు, బిల్వదళం తప్పనిసరిగా ఉంటాయి.  దర్భలు గడ్డిజాతికి చెందిన మొక్కలు. శ్రీరామచంద్రుడి స్పర్శతో పునీతమైనందున వాటిని పవిత్ర కార్యాలకు వినియోగిస్తారు.

Continues below advertisement


దర్భగడ్డికి ఉష్ణశక్తి ఎక్కు..ఇవి జలాన్ని శుభ్రపరుస్తాయి. విషానికి విరుగుడుగా పనిచేస్తాయి. అందుకే గ్రహణకాలంలో వ్యాపించే విషవాయువులను, క్రిములను నశింపచేసేందుకు దర్భలు వినియోగిస్తారు. ముఖ్యంగా ఉప్పు కలిపిన పదార్థాల్లో దర్భలు తప్పనిసరిగా ఉంచుతారు.  


దర్భలను సంస్కృతంలో అగ్ని గర్భం అని పిలుస్తారు.. ఇవి కుంభాభిషేకాల్లో,  యాగశాల్లో కలశాల్లోను‌ ,బంగారు, వెండి తీగలతో పాటుగా ధర్భలను కూడా చుడతారు...అంటే అత్యంత విలువైన బంగారాన్ని మించిన శుద్ధి దర్భ సొంతం.
 
దర్భలు మూడు రకాలు


స్త్రీ
పురుష
నపుంసక 


పురుష జాతి దర్భలు అడుగు నుంచి చివరి వరకూ సమానంగా ఉంటాయి


దర్భలు పై భాగంలో దళసరిగా ఉంటే అవి స్త్రీ దర్భలుగా గుర్తిస్తారు


అడుగున దళసరిగా ఉన్న దర్భలను నపుంసక జాతి దర్భలు అంటారు


దర్భల పై భాగం శివుడి నివాసం


దర్భల మధ్య భాగం శ్రీ మహావిష్ణువు నివాసం


దర్భల చివరి భాగం బ్రహ్మదేవుడి నివాసం
 
పితృదేవతలకు తర్పణాలు విడిచేటప్పుడు శుద్ధికోసం దర్బతోనే ఇస్తారు. భగవంతుడికి ఇచ్చే నీటిని దర్భ కొసలతో ఇస్తారు.. పితృదేవతలను తలుచుకుని ఇచ్చే దర్భలను మడిచి కొసలతో ఇస్తారు.  


వైదియ కార్యాల్లో దర్భను పవిత్రం అనే పేరుతో పిలుస్తారు
 
ధర్భతో ఓ ఉంగరాన్ని తయారు చేసి కుడిచేతి ఉంగరం వేలికి ధరించి ఆయా కార్యాలు ఆచరిస్తారు. ఎందుకంటే ఈ వేలిలో కఫనాడి ఉండడం వల్ల దర్భను ఉంగరంగా దరించడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది 
 
ప్రేత కార్యాల్లోను ఓ దర్భతో...శుభకార్యాలను రెండు దర్భలతో..పితృ కార్యాలను మూడు దర్భలతో...దేవ కార్యాలను నాలుగు దర్భలతో ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు
 
భగవంతుడి ఆరాధన, జపం, హోమం, దానం, తర్పణం వంటి కార్యాలతో దర్భలతో చేసిన పవిత్రం అనే ఉంగరాన్ని తప్పనిసరిగా ధరిస్తారు
 
ధర్భ గడ్డిలో పులుపు, క్షార గుణాలు ఉండడం వల్ల రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపర్చాలని శిల్ప శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల శిల్పాల్లోని ఆవాహన మంత్ర శక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయంటారు
 


ఆదివారం రోజు కోసిన దర్భలను ఆ వారం మొత్తం ఉపయోగించవచ్చు


అమావాస్య రోజు కోసిన దర్భలు ఓ నెల రోజుల వరకూ ఉపయోగించవచ్చు


పౌర్ణమినాడు కోసి తెచ్చే దర్భలను 15 రోజులు ఉపయోగించవచ్చు
 
శ్రావణమాసంలో కోసిన దర్భలు ఏడాది మొత్తం వినియోగించవచ్చు


భాద్రపదమాసంలో తీసిన దర్భలు ఆరు మాసాలు వినియోగించవచ్చు


శ్రాద్ధ కార్యాలకోసం తీసుకొచ్చిన దర్భలు మాత్రం ఏరోజుకి ఆరోజు మాత్రమే వినియోగించాలి


గ్రహణం పట్టు స్నానం, విడుపు స్నానం రెండుసార్లు చేయాలా? గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


సంపూర్ణ చంద్ర గ్రహణం! గ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశివారు గ్రహణం చూడకూడదు? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


చంద్రగ్రహణం ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.