కార్తీకమాసం సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది APSRTC
విజయవాడ నుంచి..
పంచారామాలు
పంచారామాలను (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ) ఒకే రోజులో దర్శించుకునే విధంగా APSRTC అవకాశం కల్పించింది. ప్రతి శనివారం, ఆదివారం, సోమవారాలతో పాటూ ముఖ్యమైన పర్వదినాల్లో ప్రత్యేక బస్సులు నడుపనున్నామని తెలిపారు. అక్టోబర్ 25, 26,27... నవంబర్ 1, 2, 3, 5,8, 9, 10, 15, 16, 17 తేదీల్లో ఉదయం నాలుగు గంటలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయలుదేరి అదే రోజు తిరిగివస్తుంది.
సూపర్ లగ్జరీ ఛార్జీ రూ.1120అల్ట్రా డీలక్స్ ఛార్జీ రూ. 1070
త్రిలింగ దర్శినం
యాగంటి, మహానంది, శ్రీశైలం...ఈ మూడు క్షేత్రాలు దర్శించుకునేలా మరో ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకొచ్చింది APSRTC. కార్తీకమాసం ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి దర్శనం అనంతరం సోమవారం ఉదయం విజయవాడకు చేరుకుంటారు. సూపర్ లగ్జరీ ఛార్జీ రూ.1800
అరుణాచలం కార్తీక పౌర్ణమికి రెండు రోజుల ముందుగా పీఎన్బీఎస్ నుంచి బయలుదేరి శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ పుణ్య క్షేత్రాలు దర్శించుకుని పౌర్ణమి రోజు అరుణాచలం చేరుకుంటుంది బస్. అదే రోజు గిరిప్రదక్షిణ చేసి అదే రోజు రాత్రి బయలుదేరి మర్నాడు విజయవాడ చేరుతుంది శ్రీశైలం
విజయవాడ నుంచి శ్రీశైలానికి ప్రతి ఆదివారం అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. APSRTC ఆన్లైన్ ఇన్, RTC టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్లు పొందవచ్చు. 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఒక బృందంగా అడిగితే వారికోసం వారికి అనుకూల తేదీల్లో నివాసం వద్దకే ప్రత్యేక బస్సులు నడుపుతామనే ఆఫర్ కూడా ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. ఇంకా వనభో జనాలకు, శబరిమల యాత్రకు ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 7382900349 నంబరులో సంప్రదించాలని కోరారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే వివిధ బస్టాండ్ల నుంచి కార్తీకమాసం స్పెషల్ గా మొత్తం 157 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది APSRTC
కాకినాడ నుంచి శ్రీశైలానికి రోజూ ఉదయం 7.45 గంటలకు ప్రారంభమయ్యే బస్సు..ఈ నెల మొత్తం అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అవసరమైతే మరిన్ని పెంచుతామని చెప్పారు అధికారులు కార్తీకమాసం పురస్కరించుకుని ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 25, 26 తేదీలతోపాటు నవంబర్ 2,9, 16 తేదీల్లో జిల్లాలోని వివిధ బస్టాండ్లు నుంచి ఈబస్సులు బయలుదేరుతాయి. ఈ బస్సుల సూపర్ లగ్జరీ ధర రూ.1,120, అల్ట్రా డీలక్స్ ధర రూ.1,070గా నిర్ణయించారు.
జిల్లాలో ప్రధాన బస్టాండ్లు అయిన కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల నుంచి శబరిమలకు కొత్త సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులు మొత్తం 8 ఏర్పాటు చేశారు. అలాగే అయ్యప్ప భక్తులు ఎక్కువమంది అడిగితే వారుకోరుకున్న చోటునుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతామని..అయితే సమాచారం ముందగా చెప్పాలని సూచించారు అధికారులు
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం