Diwali Vastu: దీపావళి అంటే కేవలం దీపాల అలంకరణ, స్వీట్లు పంచుకోవడమే కాదు..ఇది డబ్బు, శ్రేయస్సు , సానుకూల శక్తిని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేక సమయం. ఈ సందర్భంగా కొన్ని సాధారణ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.. అదృష్టాన్నిస్తాయి. ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ,ఆకర్షణీయంగా ఉంచండి

Continues below advertisement

ప్రధాన ద్వారం అంటే లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం. దీనిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. అందమైన ముగ్గు వేయండి. ద్వారం వద్ద తోరణాలు  ఉంచండి. స్వస్తిక్ లేదా "శుభ్ లాభ్" చిహ్నాన్ని కూడా ఉంచవచ్చు.

తులసి మొక్కను ఈశాన్య దిశలో ఉంచండి

Continues below advertisement

తులసి మొక్క ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది. దీనిని ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్క దీపావళి వాస్తుటిప్స్ లో భాగంగానే కాదు.. ఎప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి

ఇంటి నుంచి విరిగిన వస్తువులను తొలగించండి 

విరిగిన వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. దీపావళి శుభ్రతలో భాగంగా విరిగిన పాత్రలు, గడియారాలు, అద్దాలు , ఎలక్ట్రానిక్ వస్తువులను తీసివేయండి. విరిగిన, పాడైన ఏ వస్తువు కూడా ఉంచొద్దు 

దీపం వెలిగించే దిశ

దీపావళి రోజు ఇంటికి ఆగ్నేయ దిశలోనూ దీపాలు వెలిగించండి. సాధారణంగా దీపాలు ఈశాన్యమూలన దేవుడికి వెలిగిస్తారు. దీపావళి రోజు  ఆగ్నేయ దిశలో దీపం వెలిగిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే చీపురును సరైన స్థలంలో ఉంచండి

చీపురును ఎప్పుడూ నైరుతి దిశలో ఉంచండి. చీపురును కాళ్ళతో తాకకూడదు... నిటారుగా ఉంచకూడదు. పాత చీపురును దీపావళికి ముందు మార్చడం కూడా శుభప్రదం.

కాంతి అలంకరణ ఉత్తర దిశలో చేయండి

ఉత్తర దిశను ధనం , శ్రేయస్సు దిశగా భావిస్తారు. ఈ దిశలో కాంతిని ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

ఇంటి గోడలపై సానుకూల చిత్రాలు ఉంచండి

రాధా-కృష్ణ, లక్ష్మీ-గణేష్, ప్రవహించే నీరు లేదా సూర్యోదయం వంటి చిత్రాలు ఇంట్లో సానుకూల శక్తిని కలిగిస్తాయి.

అల్మారా లేదా బీరువా దిశ

ధనం ఉంచే అల్మారా లేదా బీరువాను దక్షిణ దిశలో ఉంచండి. దాని ముఖం ఉత్తరం వైపు ఉండాలి. ఇది ధనం రాకను ప్రోత్సహిస్తుంది.

శంఖం , గంటను ఉపయోగించండి

పూజ సమయంలో శంఖం .. గంటను మ్రోగించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది..ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

పువ్వులతో అలంకరణ చేయండి

పూల దండలు లేదా అలంకరణతో ఇంటి వాతావరణం సుగంధభరితంగా , శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా బంతి  తామర పువ్వులు శుభప్రదంగా భావిస్తారు.

ధ్యానం  మంత్ర జపం చేయండి

దీపావళి రోజున ఉదయం , సాయంత్రం ధ్యానం చేయండి

అమ్మవారి ఆరాధన

'శ్రీ లక్ష్మీ మంత్రం' లేదా 'శ్రీ సూక్తం' జపించండి. ఇది మానసిక శాంతి  ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

2025లో ధన త్రయోదశి , నరక చతుర్థశి, దీపావళి...ఏ రోజు ఏ పండుగ, ఏం చేయాలి, విశిష్టత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి