What Not To Purchase On Dhanteras: 2023 నవంబరు 11 శనివారం ధన త్రయోదశి.  ఐదురోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే  శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు.అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అయితే ఈ రోజు కొనుగోలు చేయకూడని వస్తువులు కూడా ఉన్నాయి..అవేంటో చూద్దాం...


ఇనుము


ఇనుము శనికి చిహ్నంగా భావిస్తారు..అందుకే పండుగల సమయంలో..ముఖ్యంగా శనివారం రోజు ఇనప వస్తువులు కొనుగోలు చేయరు. ఇనుముతో తయారైనా ఏ వస్తువులు కొనుగోలు చేసినా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అశుభచర్యగా పరిగణిస్తారు. పైగా ధన త్రయోదశి అంటే పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు. పైగా ఈ ఏడాది ధన త్రయోదశి శనివారం వచ్చింది. అంటే శని త్రయోదశి కూడా. అందుకే ఇనుము వస్తువులు ఈ రోజు కొనుగోలు చేస్తే శనిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే.


Also Read: ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయాలా!


స్టీల్


స్టీల్ పాత్రలు కొనుగోలు చేయకూడదు..దీని బదులుగా రాగి పాత్రలు కొనుగోలు చేయవచ్చు


పదునైన వస్తువులు


జ్యోతిషశాస్త్రంలో, ధన్‌తేరస్ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు పదునైన వస్తువులు కొనుగోలు చేస్తే కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతుందని విశ్వసిస్తారు.


Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!


గాజు పాత్రలు 


గాజు వస్తువులు రాహువుకు సంబంధించినవి కాబట్టి ధనత్రయోదశి రోజు కాదు వస్తువులు కొనుగోలు చేయడం అశుభం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి మీ ఇంటిపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయంటారు పండితులు.


అల్యూమినియం - ప్లాస్టిక్ వస్తువులు


పండుగ రోజు అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులకు కూడా దూరంగా ఉండడం మంచిది. 


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


ఖాళీ పాత్రలు


ఇనుము, స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కొనుగోలు చేయకూడదు సరే..మరి వేరే పాత్రలు కొనుగోలు చేయొచ్చా అనే సందేహం రావొచ్చు. అయితే వేరే పాత్రలు ధనత్రయోదశి రోజు కొనుగోలు చేస్తే వాటిని ఖాళీగా ఇంట్లోకి తీసుకురాకూడదు. ఏవైనా గింజలు లేదా నీటితో నిండిన పాత్రని మాత్రమే తీసుకురావాలి. 


నూనె/నెయ్యి


ధనత్రయోదశి, శనిత్రయోదశి ఈ రోజు నూనె, నెయ్యి అస్సలు కొనుగోలు చేయరాదు. అంత అత్యవసరం అనుకుంటే ముందురోజే కొనుక్కోవడం మంచిది.


Also Read: మీ బంధుమిత్రులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


నకిలీ బంగారం


ఇప్పుడంతా వన్ గ్రామ్ గోల్డ్ ట్రెండ్ నడుస్తోంది. అవకాశం ఉండేవారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే..అంత స్తోమత లేనివారు నకిలీ బంగారం కొనుగోలు చేస్తున్నారు. ధనత్రయోదశి రోజు బంగారం, వెండి కొనుగోలు చేయకపోయినా పర్వాలేదు కానీ నకిలీ బంగారం వస్తువులు కొనుగోలు చేయొద్దని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..


గమనిక: గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం