Wearing saree for women according astrology: భారతీయ మహిళలకు చీరలు కట్టుకోవడం అంటే ఎంతో మక్కువ. సాధారణంగా మహిళలు చీర కట్టుకున్నప్పుడు పైట కొంగు నేలకు తగలకుండా జాగ్రత్తపడతారు. నేలంతా ఊడ్చినట్టు అవుతుందని పైటకొంగును మోకాళ్లవరకూ వేసేవారున్నారు. అయితే నీతా అంబానీ లాంటి ధనవంతులు తమ చీర కొంగును చాలా పొడుగ్గా ఉంచుకునేందుకు ఇష్టపడతారట. ఇది వినడానికి చాలా సాధారణంగా, హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీరకొంగు పొడుగ్గా ఉంచుకోవడం శుభప్రదం. ఇలా శారీ కడితే రాయల్ లుక్ తో పాటూ భర్తకు అదృష్టాన్నిస్తుందట. 

Continues below advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.

Continues below advertisement

మహిళలు చిన్న పైటకొంగు పెట్టుకోకూడదు..చీర కొంగు నేలకు తాకేంత పొడుగ్గా ఉండాలట. ఈ విధంగా చీర కట్టుకోవడం వల్ల సంపద పెరుగుతుంది

ఆధ్యాత్మిక దృక్కోణం ప్రకారం..

మూలాధారం నుంచి సహస్రారం వరకు పైకి ఎక్కే కుండలినీ శక్తి.. స్త్రీల  చీర పైట-కొంగు ద్వారా  బయటకు వస్తుందట. పైట చిన్నగా ఉంటే బయటకు వెళ్లిపోతుందని..పొడుగ్గా పాదాలు తాకేలా ఉంటే ..ఆ శక్తి తిరిగి శరీరంలోనే రీ-సర్కులేట్ అవుతుందనీ చెబుతారు.

లలితా సహస్రనామం ప్రకారం..

“పాదాంగులియు రక్షితా”  

దేవి పాదాలను కప్పే చీర కొంగుతో తన శక్తిని స్వయంగా రక్షించుకుంటుందని దీని అర్థం. అందుకే స్త్రీ కూడా పాదాలు కప్పేలా కొంగు వదిలితే, ఆ శక్తి భూమిలోకి పోకుండా తిరిగి శరీరంలోకి వస్తుందని.

గృహిణి లక్ష్మీ స్వరూపిణి

ఇంటి లక్ష్మి (సంపద, శ్రేయస్సు) ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. చిన్న పైట అంటే లక్ష్మి బయటకు వెళ్తుందని, పొడవైన కొంగు అంటే లక్ష్మి ఇంట్లోనే నిలుస్తుందని పెద్దలు  చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు ఏ చెబుతారంటే..

కొంగు నేలను తాకినా లేకున్నా కనీసం పాదాల మీద తాకేలా ఉండాలి 

ఇంటి బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా పొడవుగా వదలాలి.

పూజ చేసేటప్పుడు, దేవుడి ముందు నిలబడేటప్పుడు కచ్చితంగా పాదాలు కప్పేలా ఉండాలి చీరకట్టు

ఇది జ్యోతిష్య శాస్త్ర గ్రంధాల్లో రాసి ఉన్న శాస్త్రీయ నియమం కాదు..గురు పరంపరలో వస్తున్న ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే. కానీ ఈ రహస్యాన్ని తెలుసుకుని పాటించినవారికి అదృష్టం కలిసొస్తుందని నమ్మకం మీ రాశి ప్రకారం ఏ రంగు చీర కలిసొస్తుంది?

ఎరుపు రంగు చీర మేషం

తెలుపు లేదా గులాబీ రంగు చీర వృషభం

ఆకుపచ్చ రంగు చీర మిథునం

వెండి లేదా లేత బూడిద రంగు చీర కర్కాటకం

కాషాయ రంగు చీర సింహం

ఆకాశ నీలం రంగు చీర కన్య

గులాబీ రంగు చీర తుల రాశి

ఊదా లేదా ఎరుపు రంగు చీర వృశ్చికం

పసుపు లేదా నారింజ రంగు చీర ధనుస్సు

నేవీ బ్లూ లేదా ముదురు బూడిద రంగు చీర మకరం

నీలం లేదా ఊదా రంగు చీర కుంభం

లేత పసుపు లేదా గులాబీ రంగు చీర మీనం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.