Superstitions About Birds : పక్షుల గురించి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు సహా వివిధ సంస్కృతులలో చాలా నమ్మకాలు, కొందరికి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ  నమ్మకాలు తరచుగా స్థానిక సంప్రదాయాలు, జానపద కథలు...ఆధ్యాత్మిక నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి 10 పక్షులకు సంబంధించి ఉన్న ప్రచారాలు గురించి తెలుసుకుందాం. గుడ్లగూబ రాత్రివేళ అరిస్తే దురదృష్టం

గుడ్లగూబ రాత్రిపూట అరవడం దురదృష్టం లేదా మరణ సంకేతంగా చాలా సంస్కృతులలో, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో నమ్ముతారు.  దీనిని తరచూ చెడు శకునంగా భావిస్తారు.

కాకి ఇంటి పైకప్పుపై కూర్చుంటే అతిథుల రాక

కాకి ఇంటి పైకప్పుపై కూర్చుని కావ్ కావ్ అని అరిస్తే..ఇంటికి అతిథులు వస్తారని నమ్ముతారు. ఇప్పటికీ ఈ నమ్మకం చాలాప్రాంతాల్లో ఉంది. అది నిజం అయినా కాకపోయినా.. కాకి అరిచిన వెంటనే చుట్టాలొస్తారేమో అనే మాట అప్రయత్నంగా వచ్చేస్తుంది పక్షి ఇంట్లోకి ఎగిరితే శుభవార్త

ఒక పక్షి ఇంట్లోకి ఎగురుకుంటూ వస్తే అది శుభవార్తను తెస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇది చెడు శకునంగా కూడా పరిగణిస్తారు. వచ్చిన పక్షి బయటకు వెళ్లకపోతే అది దురదృష్టంగా భావిస్తారు నీలి పక్షి (బ్లూ జే) శుభసూచనం

నీలి రంగు పక్షిని చూడటం సంతోషానికి, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇలాంచి పక్షులను పవిత్రంగా భావిస్తారు.

కొంగ ఒక కాలుపై నిలబడితే వర్షం

కొంగ ఒక కాలుపై నిలబడి కనిపిస్తే త్వరలో వర్షం వస్తుందనే సూచన అంటారు గ్రామీణులు. 

పక్షి తలపై రెట్ట వేస్తే దురదృష్టం

పక్షి తలపై రెట్ట వేస్తే అది చెడు శకునంగా లేదా అనారోగ్య సమస్యల సూచనగా భావిస్తారు.

వుడ్‌పెక్కర్ శుభం

వుడ్‌పెక్కర్ శబ్దం శుభసూచనగా భావిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే ఈ శబ్ధం వినిపిస్తే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు రెండు కాకులు కలిసి ఎగిరితే సంతోషం

రెండు కాకులు కలిసి ఎగరడం చూస్తే అది సంతోషం వివాహ సూచనకు సంకేతంగా నమ్ముతారు. ఒక కాకి కనిపించినా, ఎగురుతున్న రెండు కాకులు చెరో దిక్కు ఎగిరినా అది ఒంటరితనం లేదా దుఃఖానికి సంకేతంగా భావిస్తారు.

గుడ్లగూబ ఇంటిలోకి వస్తే మరణం

గుడ్లగూబ ఇంటిలోకి రావడం చాలా అరుదైన సంఘటన కానీ ఇది జరిగితే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని కొందరు నమ్ముతారు.

పక్షి గూడు వదిలివేయడం అశుభం  పక్షి ఇంటి సమీపంలో గూడు కట్టి, ఆ తర్వాత దాన్ని వదిలివేస్తే అది ఇంట్లో సమస్యలు లేదా ఆర్థిక నష్టానికి సూచనగా భావిస్తారు.

గమనిక:   ఇవన్నీ సాంస్కృతిక , సాంప్రదాయిక నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ ఆధారం ఉండకపోవచ్చు.  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

పాలగిన్నె మూత తీసినా, కుక్క ఏడ్చినా ఆత్మలకు ఆహ్వానం పలికినట్టే! తరచూ వినిపించే 7 మూఢనమ్మకాలు - వాటి వెనుకున్న ఆశ్చర్యపోయే వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి