Homer's Odyssey vs Ramayana & Mahabharata: క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చన The Odyssy సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ కథ, నటన, VFX గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ..సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రామాయణం, మహాభారతం కథలను గుర్తుచేస్తున్నాయని చెబుతున్నారు. చారిత్రకంగా ఒకదాని నుంచి మరొకటి ప్రభావతిమైందని కాదు..హోమర్ రాసిన The Odyssey కి భారతీయ గ్రంథాలకు సంబంధం లేదు. కానీ ప్రపంచంలో కథలు చివరికి ధైర్యం, త్యాగం, కర్తవ్యం, ఇంటికి వెళ్లాల్నే కోరిక వంటి ఉమ్మడి విషయాల వద్దకు వస్తాయి.

Continues below advertisement

HomecomingThe Odyssey లో ఒజిస్సియన్ ట్రోజన్ యుద్ధంలో 10 ఏళ్లు ..తిరిగి చేరుకోవడానికి 10 ఏళ్లు కష్టపడతారు. మధ్యలో తుఫానులు, రాక్షసులు, శోధనలు ఎదురవుతాయి. ఇది రామాయణంలో శ్రీరాముడి వనవాసం లాంటిదే. 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని కుటుంబాన్ని కలుసుకుని ధర్మాన్ని నిలబెడతాడు. సందర్భం వేరైనా హీరో ఇంటికి తిరిగి రావడం అనే పాయింట్ రెండింటిలోనూ ఒకేలా ఉంది. అందుకే ప్రేక్షకులు ఈ కథను రామాయణంలో లింక్ చేసుకుని కనెక్ట్ అవుతున్నారు. Divine Guidance నోలన్ సినిమాలో అథీనా దేవత Zendaya పాత్ర - ఒడిస్సియస్‌కు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. దారి చూపిస్తుంది, ధైర్యాన్నిస్తుంది..కానీ యుద్ధం చేయదు. నిర్ణాలు ఒడిస్సియస్‌ తీసుకోవాలి..అంటే ఇది మహాభారతంలో శ్రీ కృష్ణుడి పాత్రను గుర్తుకుతెస్తుంది. శ్రీ కృష్ణుడు పాండవుల కోసం యుద్ధం చేయలేదు కానీ గీతా బోధన, మార్గదర్శకత్వంతో వారిని గెలిపించాడు. దేవుడు అంటే కాపాడడం కాదు..దారి చూపడం అని అర్థం

విల్లు - హీరోని నిర్ణయించే పరీక్ష రామాయణంలో సీతా స్వయంవరంలో శివుడి విల్లు ఉంటుంది. ఎవరు విల్లు ఎక్కుపెడితే వారే సీతను పెళ్లి చేసుకుంటారు. పెద్ద పెద్ద రాజులు ఫెయిల్ అయ్యారు కానీ రాముడు సునాయాసంగా విల్లు ఎక్కుపెట్టి తాను అర్హుడు అని నిరూపించుకున్నాడు. The Odyssey క్లైమాక్స్ లోనూ ఇదే జరుగుతుంది. ఒడిస్సియస్‌ చనిపోయాడని అంతా అనుకుంటారు.. పెనెలోపి ఎవరు ఈ విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తారో వారినే పెళ్లిచేసుకుంటా అని ప్రకటిస్తుంది. అందరూ ఫెయిల్ అవుతారు..కానీ బిచ్చగాడి రూపంలో వచ్చిన ఒడిస్సియస్‌ సులభంగా విల్లు క్కుపెడతాడు. కథలు వేర్వేరు అయినా..ఇక్కడ విల్లు అంటే శక్తి, అర్హత, విధికి గుర్తు. 

Continues below advertisement

రామాయణంలో రాముడు..రావణడు, మారీచుడు వంటి మాయావులతో యుద్ధం చేస్తాడుమహాభారతంలో పాండవులు అడవుల్లో ఉన్నప్పుడు రాక్షసులను, విచిత్ర జీవులను ఎదుర్కొంటారుఒడిస్సియస్ తన ప్రయాణంలో సైక్లోప్స్, సైరన్లు, ప్రమాదకరమైన జీవులతో పోరాడుతాడు

The Odyssey: ఓ మనిషి ఇంటికి చేరే ప్రయాణం...రామాయణం - ఆదర్శపాలన, కర్తవ్యంపై భక్తిమహాభారతం - ధర్మం, మానవ స్వబావంలో సంక్లిష్టత

అందుకే The Odyssey సినిమాను రామాయణం, మహాభారతంతో పోల్చి చూస్తున్నారు. ఇవన్నీ ఒకటే అని కాదు.. మానవ భావోద్వేగాలు ప్రపంచమంతా ఒకేలా ఉంటాయని చెప్పడమే వీటి ఆంతర్యం. పురాతన గ్రీకు దేశమైనా, పురాతన భారతమైనా... ఇంటిని వెతుక్కుంటూ చేసే ప్రయాణం, ధర్మం కోసం చేసే పోరాటం ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటాయ్