Ashadha Friday Lakshmi Mantra Benefits: హైందవ సంస్కృతిలో శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి అంకితం చేశారు. కాబట్టి ఈ రోజు మనం ఒక చిన్న లక్ష్మీ మంత్రాన్ని జపించినా ఆమె సంతోషిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఆషాఢ శుక్రవారం రోజు ఏ లక్ష్మీ మంత్రాన్ని పఠించాలి..? ఆషాఢ శుక్రవారం తప్పకుండా ఈ లక్ష్మీ మంత్రాలను పఠించండి.
హిందూ సంప్రదాయాల ప్రకారం, వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేశారు. అదే విధంగా, శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజు లక్ష్మీదేవిని సంప్రదాయం ప్రకారం పూజించడం, ప్రత్యేక మంత్రాలను పఠించడం ద్వారా లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమై తన భక్తులకు అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ రోజున లక్ష్మీ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదని, కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని చెబుతారు. ఇది మాత్రమే కాదు, శుక్ర దోషం నుంచి విముక్తి పొందడానికి కూడా శుక్రవారం లక్ష్మీ మంత్రాలను జపిస్తారు.
Also Read : శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!
శుక్రవారం ఈ మంత్రాలను జపించండి
1. లక్ష్మీ బీజ మంత్రం
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద
ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే నమః॥
2. శ్రీ లక్ష్మీ మహామంత్రం
ఈ లక్ష్మీ మహామంత్రం వ్యక్తికి శ్రేయస్సునిచ్చే మంత్రం.
"ఓం శ్రీం క్లీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఏహి సర్వ సౌభాగ్య దేహి మే స్వాహా"
3. ఆర్థిక ఇబ్బందుల నివారణ మంత్రం
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి.
ఓం హ్రీం శ్రీ క్రీమ్ క్లీం శ్రీ లక్ష్మీ మమ గృహే ధన పూరే
ధన్ పూరయే, చింతయేం దుర్యోయే - దురోయే స్వాహా ||''
4. ఆనందం, శ్రేయస్సును అనుగ్రహించే మంత్రం
"యా రక్తాంబుజవాసినీ విలాసినీ ఛన్దశు తేజస్వినీ|
యా రక్త రుధిరాంబర హరిఖీ యా శ్రీ మనోళాదినీ||
యా రత్నాకరమంథానాత్ప్రగతితా విష్ణోస్వయ గేహినీ|
సామాంపాతు మనోరమా భగవతీ లక్ష్మీశ్చ పద్మావతీ||''
ఆషాఢ శుక్రవారం నాడు పైన పేర్కొన్న మంత్రాలతో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుంది. లక్ష్మీదేవి తన భక్తులను త్వరగా అనుగ్రహిస్తుంది. ఈ మంత్రాలను పఠించడం ద్వారా, మీరు జీవితంలోని అన్ని రంగాల్లో విజయాన్ని పొందుతారు. దీనితో పాటు శ్రేయస్సు, సంపద, ఆనందం కలుగుతాయి.
Also Read : లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు, వాటి వెనుకున్న విశిష్టత ఏంటి!
మీరు మీ జీవితాంతం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే, ఆషాఢ శుక్రవారమే కాకుండా ప్రతిరోజు పూజానంతరం ఈ మంత్రాలను పఠించండి. దీని వల్ల మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.