చాణక్య నీతి: ఆచార్య చాణక్యుని ప్రకారం ఎప్పుడూ ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు. చాలామంది ఓ విషయంపై తమ స్నేహితులు లేదా సన్నిహితులతో వాదన పెట్టుకుని వారిదగ్గర తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈ ముగ్గురు వ్యక్తులను ఒప్పించడానికి ప్రయత్నించడం, వారితో వాదించడం సమయం వృధా , అవివేకం అని తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు
చాణక్య నీతి: ఇగ్నోర్ చేయడం అవసరం కాదు ఆయుధం.. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఇగ్నోర్ చేయాలో తెలుసుకోండి!
మొండి , తెలివి తక్కువ వ్యక్తులు
మొండిగా వ్యవహరించేవారు, తెలివి తక్కువ వ్యక్తులకు ఏదైనా వివరించడానికి ప్రయత్నించడం అవివేకం. అలాంటి వారిని మార్చమని ఒప్పించడానికి మీరు ప్రయత్నిస్తే, వారు అర్థం చేసుకోరు. ఇది మీ సమయాన్ని వృధా చేయడమే కాకుండా, మీ మానసిక స్థితిని కూడా పాడు చేస్తుంది. అందువల్ల, మీరు అలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దని సూచించారు చాణక్యుడు ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి
ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అలాంటి ప్రతికూల స్వభావం గల వ్యక్తులకు దూరంగా ఉండాలి. వారితో వాదించడం లేదా గొడవపడటం మంచిది కాదు. వారితో మాట్లాడటం వల్ల మీ మనసులో కూడా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఈ వ్యక్తులు ఎవరి అభిప్రాయాన్ని సరైనదిగా అంగీకరించరు. వారి వాదనలో బలం లేకపోయినా అదే వాస్తవం అనే భ్రమలో ఉంటారు. అలాంటి వారితో వాదించడం లేదా వారిని ఒప్పించడానికి ప్రయత్నించడం వల్ల మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు.ఆ వ్యక్తులతో సహవాసం మీ జీవితంలో కొత్త సమస్యలను సృష్టించగలదు.
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
మోసపూరిత , జిత్తులమారి వ్యక్తులు మీ చుట్టూ స్నేహం లేదా బంధం ముసుగులో ఇలాంటి వారుంటారు. వారిని గుర్తించకపోతే మీరు ఎప్పటికీ ఉన్నత స్థానానికి చేరుకోలేదు. మోసం చేసేవారు లేదా జిత్తులమారి వ్యక్తి ఎవరో మీరు గుర్తించగలిగితే వారితో ఎట్టిపరిస్థితుల్లోనూ వాదించడం చేయొద్దు. ఈ వ్యక్తులు దుర్మార్గులు , స్వార్థపరులు. వారు ఎప్పుడూ తమ స్వప్రయోజనాల మీదే దృష్టి పెడతారు. వారికి ఏదైనా వివరించడానికి ప్రయత్నించడం లేదా ఏ విషయంలోనైనా వారికి సలహా ఇవ్వడం మీ సమయాన్ని వృధా చేయడమే. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోరు. దానికి విరుద్ధంగా, వారు మిమ్మల్ని తమ శత్రువుగా భావించడం ప్రారంభిస్తారు.
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
ఎప్పుడూ కూడా ఎవరినైనా ఒప్పించడానికి ప్రయత్నిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకూడదు. అవతలి వ్యక్తి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే, వారితో వాదించే బదులు మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. మీ ఆలోచనలను వినడానికి, అర్థం చేసుకోవడానికి , అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నవారితో మాత్రమే ఏ విషయం గురించైనా చర్చించండి.
