Chanakya Niti:  ఆచార్య చాణక్యుడు తన శిష్యులకు బోధించిన విషయాలు తరాలు గడిచినా అనుసరించేవిగా ఉంటాయి. అలాంటివాటిలో ఒకటి ఇగ్నోర్ చేయడం.. 

Continues below advertisement

ఎవర్ని ఇగ్నోర్ చేయాలి?

ఏ సమయంలో ఇగ్నోర్ చేయాలి?

Continues below advertisement

ఎందుకు ఇగ్నోర్ చేయాలి?

ఎవరికి ఓ ఛాన్స్ ఇవ్వాలి?

ఇగ్నోర్ చేయడం అవసరం కాదు ఆయుధం అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎందుకు బోధించారు? ఇగ్నోర్ చేయడం అంటే.. మౌనంగా ఉండడం లేదా పట్టించుకోనట్టు వ్యవహరించడం. ఇది చాలా శక్తివంతమైన ఆయుధం అని తన నీతిశాస్త్రంలో వివరించారు ఆచార్య చాణక్యుడు. 

చాణక్యుడు సూత్రీకరించిన రాజనీతి, యుద్ధనీతిని వ్యక్తిగత జీవితంలోనూ వాడుకోవచ్చు.  చాణక్యనీతిలో ఇగ్నోర్ గురించి చెబుతూ ఓ శ్లోకం ఉంది

"యస్య న జాయతే క్రోధః సర్వసిద్ధిః స ఉచ్యతే"

ఎవరైతే కోపాన్ని బయటకు ప్రదర్శించరో వారు అన్నీ సాధించినవారు అవుతారు. అంటే కోపం, బాధ, అవమానం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండడం ఓ ఆయుధం. 

ఇగ్నోర్ చేయడం ఎందుకు ఆయుధం అవుతుంది?

మౌనంగా ఉండడం అంటే శత్రువుని బలహీనంగా మార్చేయడమే. ఎందుకంటే మీరు రియాక్టైతే వారికి ఆనందం..అదే మీరు సైలెంట్ గా ఉండిపోతే వారు నీపై ఏ ప్రభావం చూపించలేకపోయారనే భయం మొదలవుతుంది

నీ శక్తిని నువ్వు కాపాడుకున్నట్టే చులుకనగా మాట్లాడేవాళ్లకు, నీ మంచితనాన్ని నీ కష్టాన్ని అర్థం చేసుకోనివారికోసం సమయం వృథా చేయకుండా నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెడితే చాలు..నీ శక్తిని నువ్వు కాపాడుకున్నట్టే...అప్పుడే కదా మంచి ఫలితాలు సాధించగలరు.. మనస్తాపం తగ్గుతుంది ప్రతి చిన్న విషయానికి ఎప్పుడైతే అతిగా స్పందిస్తారో అలాంటి వారి మనసు ఎప్పుడూ కలవరంలో ఉంటుంది. ఎప్పుడైతే ఇగ్నోర్ చేయడం నేర్చుకుంటారో అప్పుడు మీ మనశ్సాంతికి భంగం కలిగించేవారు ఎవ్వరూ ఉండరు. అంటే మనస్తాపానికి మీకు అవకాశం ఇవ్వడంలేనట్టే కదా.. మీకు మీరే రాజు మంత్రి సింహం సింగిల్ గా వస్తుంది..కుక్కలే గుంపుగా మొరుగుతాయ్ అనే డైలాగ్ సినిమాల్లో ఉంటుంది. అయితే ఇదే విషయం చాణక్య నీతిలోనూ ఉంది. గుంపుగా మొరిగే కుక్కల్ని సింహం పట్టించుకోదు..వాటికి సమాధానం చెప్పదు..జస్ట్ ఇగ్నోర్ చేసి రాజసంగా తన దారిలో తాను వెళ్లిపోతుంది అంతే.. ఎవర్ని ఇగ్నోర్ చేయాలి?

@ మిమ్మల్ని చులకగా మాట్లాడేవారిని ఇగ్నోర్ చేయండి....ఎందుకంటే వాడి స్థాయి నీకన్నా తక్కువ @ మీ విజయాన్ని చూసి జీర్ణించుకోలేనివాళ్లను ఇగ్నోర్ చేయండి... ఎందుకంటే వాళ్లు ఓడిపోయారు , పట్టించుకోవడం అనవసరం @ నీ కష్టాన్ని అర్థం చేసుకోని వారిని ఇగ్నోర్ చేసేముందు ఓ అవకాశం ఇచ్చి చూడండి.. మొదట్లో అపార్థం చేసుకున్నా ఆ తర్వాత అర్థం చేసుకుంటారేమో చూడండి. ఆ అవకాశాన్ని వారు వినియోగించుకోకుండా ఇంకా హద్దు దాటితే వారిని ఇగ్నోర్ చేయండి @ మీ గౌరవానికి, భద్రతకు హాని కలిగించే వ్యక్తులను ఇగ్నోర్ చేయండి..ఇలాంటి వారి విషయంలో అస్సలు మరో ఆలోచన ఉండకూడదు  శత్రువు నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే మౌనంగా నవ్వు - అదే వారికి అతి పెద్ద శిక్ష తక్కువ మాట్లాడగలిగినప్పుడే నువ్వు ఎక్కువ ఆలోచించగలవని గుర్తుపెట్టుకో మూర్ఖుడు మాటలతో కాదు మౌనంతో ఓడిపోతాడు.. నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావంటే నువ్వు బలహీనుడికి అని కాదు.. అజేయుడివి అని అర్థం. 

అయితే ఇగ్నోర్ చేయడం అనే ఆయుధాన్ని  ఏ సమయంలో వాడాలో కూడా సరిగ్గా తెలుసుకోవాలి..లేదంటే బంధాలు ముగిసిపోతాయ్