Chanakya Niti: ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకడిగా పేరొందాడు. నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, వ్యూహకర్త మాత్రమే కాకుండా, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు. జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి చాణక్యుడు సూచించిన నియ‌మాల‌ను అనుసరించేావారెందరో.  వ్యక్తిగత జీవితం నుంచి పని, వ్యాపారం, మాన‌వ‌ సంబంధాల వరకు అన్ని అంశాలపైనా పూర్తి స్పష్టతనిచ్చాడు చాణక్యుడు. చాణక్యుడి సూత్రాలను అనుసరించడం ద్వారా ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. 


ఒక వ్యక్తి జీవితంలో పురోగతి కోసం ఆచార్య చాణక్యుడు ఎన్నో సూచనలు చేశాడు. వాటిలో ఒకటి మరొకరి సంపద లేదా డబ్బు కోసం అత్యాశతో ఉండకూడదు. ఒక వ్యక్తి ఇతరుల డబ్బుపై చెడు దృష్టితో ఉండ‌కూడదు. ఎప్పుడైతే ఇతరుల సంపద లేదా డబ్బుపైనా, దురాశ‌తో ఉంటామో ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాల‌నే చెడు త‌లంపు మ‌న మ‌న‌సులోకి ప్ర‌వేశిస్తుందో అప్పుడే మన జీవితం నాశనం కావ‌డానికి బీజం ప‌డుతుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇతరుల సంపద లేదా డబ్బు కోసం అత్యాశకు పోతే మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటామో తెలుసా.?


1. నష్టం తప్ప‌వు
చాణక్య నీతి ప్రకారం, అత్యాశతో ఉన్న వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను లేదా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అలాంటి వ్య‌క్తి త‌న‌ జీవితంలో చాలా నష్టాలను భరించవలసి ఉంటుంది. కాబట్టి మీరు దురాశ‌కు దూరంగా ఉండి వీలైనంత జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి.


Also Read : ఈ విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా లేకుంటే జీవితంలో అభివృద్ధి క‌ష్ట‌మే!


2. తృప్తి అవ‌స‌రం
మనం ఎప్పుడూ ఇతరుల సంపద కోసం అత్యాశతో ఉండకూడదని ఆచార్య చాణక్యుడు స్ప‌ష్టంచేశాడు. భ‌గ‌వంతుడు ఇచ్చిన దానితోనే మనం సంతృప్తి చెందాలి. ఎదుటివారిని చూసి ఈర్ష్య‌, అసూయ చెంద‌కుండా వారిలా ప్రగతి సాధించేందుకు కృషి చేయాలి.


3. ప్రాణాపాయం
ఇతరుల సంపదపై దురాశతో ఉండటం ప్రమాదానికి దారి తీస్తుంది. మితిమీరిన కోరికతో ఇతరుల సంపదను అపహరించడానికి చెడు మార్గాలను ఆశ్రయించవలసి ఉంటుంది. దీని వల్ల మీరు మీ జీవితాన్ని కోల్పోవచ్చు.


4. అనుభవాలు
అత్యాశగల వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక చింతతో నిమగ్నమై ఉంటాడు. అత‌ను త‌న జీవితంలో ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఏదో ఒక‌ సంక్షోభంతో పోరాడుతూనే ఉంటాడు. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాల‌ని చాణ‌క్యుడు సూచించాడు.


Also Read : తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు ఎందుకు - దీనిపై చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా!


మనిషి జీవితంలో ఏది లభించినా దానితో సంతృప్తి చెందాలని చాణక్యుడు చెప్పాడు. మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో మాత్రమే మనం సంతృప్తి చెందగల‌మ‌ని.. ఇతరుల డబ్బును దోచుకోవడం లేదా వారి డబ్బు కోసం అత్యాశ ఉండ‌టం వ‌ల్ల కాద‌ని స్ప‌ష్టంచేశాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.