Chanakya Neeti Telugu:  ఆచార్య చాణక్యుడు..గొప్ప వ్యూహకర్త, పండితుడు, ఉపాధ్యాయుడు, సలహాదారుడు, ప్రాచీన భారతదేశపు ఆర్థికవేత్త...మౌర్య వంశం విజయం వెనుక చాణక్యుడి దౌత్యం ఉంది. గొప్ప వ్యూహకర్త, ఆర్థికవేత్త అయిన చాణక్యుడు తన విధానాల బలంతో నంద వంశాన్ని నాశనం చేసి...చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు. చాణక్యుడికి రాజకీయాల గురించి మాత్రమే కాదు సమాజంలోని ప్రతి విషయం గురించి లోతైన జ్ఞానం, అంతర్దృష్టి ఉంది . చాణక్యుడి రచనలను అందులో ప్రస్తావించిన వ్యూహాలను ఇప్పటికీ ఎందరో పాలకులు, నాయకులు , ప్రసిద్ధ వ్యక్తులు  అనుసరిస్తున్నారు.


చాణక్యడు బోధించిన  విషయాలు జీవితంలో విజయం సాధించడానికి మనిషిని ప్రేరేపిస్తాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే సమస్యలను ఎలా చేసుకోవచ్చో అర్థమవుతుంది. ఒక వ్యక్తి సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా ఉండాలో ,ఎలా ఉండకూడదో కూడా బోధించాడు. నైతికత గురించి ప్రస్తావించిన చాణక్యుడు..నైతిక విలువలు లేని వ్యక్తులకు సలహాలు ఇస్తే వారు వినకపోగా..మీకు శత్రువులగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించాడు..ఇంకా ఏం చెప్పాడంటే..


Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది.. 


మూర్ఖుడికి సలహా ఇవ్వొద్దు
మీ మాటలకు గౌరవం ఇచ్చి ఆచరించే వ్యక్తులకు మాత్రమే సలహాలు సూచనలు ఇవ్వాలి..మూర్ఖులకు సలహా ఇస్తే అనవసర వాదన తప్ప ప్రయోజనం ఉండదు. వాదన కారణంగా అసలు విషయం పరిష్కారం అవకపోగా..కొత్త సమస్య తయారవుతుంది.


తప్పుడు వ్యక్తులకు
స్వభావరీత్యా తప్పు చేసేవారు..ఎదుటి వ్యక్తులను ఎప్పుడూ తప్పుగానే, శత్రువులుగానే చూస్తారు. పైగా ఏ క్షణం అయినా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వారికి సలహాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు...కొన్ని సందర్భాల్లో వారు చెసే తప్పడు పనుల్లో మీకు తెలియకుండానే ఇరుక్కునే ప్రమాదం ఉంది.


అత్యాశపరులకు
చాణక్య విధానం ప్రకారం అత్యాశ గల వ్యక్తికి సలహా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికి సలహా ఇవ్వడం అంటే వారిని మీ శత్రువులుగా మార్చుకోవడమే. అత్యాశపరులు డబ్బు అనే దురాశతో ప్రతీదీ చేస్తారు, తప్పుడు మార్గంలో నడవడానికి కూడా వెనుకాడరు


Also Read:  ఈ ముగ్గురు వ్యక్తులతో అతి చనువు అత్యంత ప్రమాదకరం


అనుమానించే వ్యక్తులకు 
మనపై నమ్మకం లేకపోయినా పర్వాలేదు కానీ అనుమానం ఉండకూడదు. అనుమానించే వ్యక్తులకు సన్నిహితంగా ఉంటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్టే. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. సలహాలు,సూచనలు అస్సలు ఇవ్వకపోవడం ఇంకా ఉత్తమం


స్వర్ణయుగంలో తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. కౌటిల్యుడు రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది.  గుప్తల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభాపాటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు. తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు. ఈయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది.