Chanakya Neeti In Telugu: చాణక్యుడి పేరు చెప్పేసరికి గొప్ప రాజకీయ గ్రంథం అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అంతేకాదు… తన అపారమైన రాజనీతితో వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి… మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావి చాణక్యుడు. నంద వంశ నిర్మూలను మౌర్యవంశ స్థాపనకు కారకుడైన కౌటిల్యుడు కేవలం అర్థశాస్త్రం, రాజనీతిజ్ఞత మాత్రమే కాదు. సుఖమయ జీవితానికి పాటించాల్సిన చాలా నియమాలను చెప్పాడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవిత పురోగమనానికి సంబంధించిన అనేక అంశాలను వెల్లడించాడు. కష్ట సమయాల్లో మనకు మద్దతు ఇచ్చే నిజమైన స్నేహితుడు డబ్బు. ఇది కష్టమైన జీవనశైలిని ఆహ్లాదకరంగా, సులభంగా మారుస్తుంది. ధనికుడు డబ్బు ఉన్నంత వరకు సమాజంలో గౌరవం పొందుతాడు. కానీ తన దగ్గర డబ్బున్నప్పుడు దాన్ని తన డాబు కోసం వాడుకునేవాడికి ఎప్పటికీ గౌరవం దక్కదు. మన భవిష్యత్తు గురించి చాణక్య నీతిలో అనేక విషయాలు వెల్లడించాడు.
Also Read: అలా జీవించడం, మరణం కంటే బాధాకరం
ఆచార్య చాణక్యుడి ప్రకారం, ప్రపంచంలో చేయవలసినవి నాలుగు విధులు మాత్రమే. ఈ నాలుగు తప్ప ప్రపంచంలో ఉన్నవన్నీ పనికిరానివే. చాణక్యుడు చెప్పిన నాలుగు విధులు ఏమిటో తెలుసుకుందాం, వీటిని చేయడం ద్వారా ఏ సామాన్యుడైనా జీవితాంతం ఆనందాన్ని పొందగలడు.
దానధర్మాలు
ఈ ప్రపంచంలో దానానికి మించినది ఏదీ లేదు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఈ భూమిపై ఉన్న ఏకైక గొప్ప దానం అన్నదానం, నీరు. ఈ దానం తప్ప ప్రపంచంలో ఇంత విలువైన వస్తువు లేదు. ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం, దప్పికతో ఉన్నవారికి నీరు ఇచ్చే వ్యక్తి కంటే గొప్ప పుణ్యాత్ముడు లేడు.
ఏకాదశి ఉపవాసం
ఆచార్య చాణక్యుడు ఏకాదశి తిథిని అత్యంత పవిత్రమైన తిథిగా పరిగణించారు. ఏకాదశి తిథి నాడు ఆరాధించడం, ఉపవాసం చేయడం, పవిత్రంగా ఉండటం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహిస్తాడు. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది.
గాయత్రీ మంత్రం
ఆచార్య చాణక్యుడు గాయత్రీ మంత్రాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రంగా పేర్కొన్నాడు. గాయత్రి దేవిని వేదమాత అంటారు. నాలుగు వేదాలు ఆమె నుంచే ఉద్భవించాయి.
Also Read: ఈ ముగ్గురు వ్యక్తులతో అతి చనువు అత్యంత ప్రమాదకరం
మాతృమూర్తి
ఈ భూమిపై తల్లిని మించిన వారు ఎవరూ లేరు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. తల్లిని మించిన దైవం లేదు, తీర్థయాత్ర లేదు, గురువు లేదు. తల్లికి సేవ చేసే వ్యక్తికి ఈ లోకంలో తీర్థయాత్ర అవసరం లేదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
ఈ నాలుగు విధులపై ఆచార్య చాణక్యుడు చెప్పిన శ్లోకం
నత్రోదక్ సమంద్ దానం న తిథి ద్వాదశి సమా ।
న గాయత్ర్యః పరో మన్త్రం న మాతుదేవతాం పరమ్ ।।
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.