హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో ఈ రెండింటినీ చేర్చారు.  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని షేర్ చేశారు. భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో  మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు లభించింది. భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌.ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయని పోస్ట్ లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇది గర్వకారణం అన్నారు. యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రం చేర్చడం అంటే మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దక్కిన ఘనమైన గుర్తింపు అన్నారు.

ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ...ఇది మన విశ్వాస వ్యవస్థలకు మళ్లీ ప్రాణం పోస్తుంది. దేశానికి దూరదృష్టి కలిగిన ప్రధాని మోదీ నాయకత్వం కారణంగానే ప్రపంచ వేదికలపై మన ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తున్నారు. సంస్కృతిలోని దీర్ఘాయుష్మత్వం భారతదేశానికి ఆత్మస్వరూపమేనని పేర్కొన్నారు. భారతదేశం సనాతన ధర్మానికి నిలయంగా అభివర్ణించారు. ఆధ్యాత్మిక సత్యానికి మార్గదర్శకంగా నిలిచిందంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌లకు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

మహాభారత సంగ్రామంలో గురువులు, సోదరులు, బంధువులను చూసి దనుర్భాణాలు విడిచిపెట్టేశాడు అర్జునుడు. అలాంటి సమయంలో చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించినదే భగవద్గీత. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. అందులో సమాధానం దొరకని ప్రశ్నఉండదు. అందుకే నాటి నుంచి నేటివరకూ భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస గ్రంధం మరొకటి లేదని పాశ్చాత్యులు కూడా అంగీకరించారు. ఇప్పుడు భగద్గీతకు యునెస్కో గుర్తింపురావడమే ఇందుకు నిదర్శనం

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి