Ashada Masam Significance: ఆషాఢమాసం తెలుగు నెలల్లో నాల్గవది. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటాడు. ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమయ్యే నెల ఇది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోక ప్రవేశించడంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఈ నెలలో వానలు ప్రారంభమవుతాయి. ప్రకృతి పునరుజ్జీవనం పొందే కాలం ఇది.
వంట నుంచి సైన్స్ కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
2026 లో ఆషాఢ మాసం జూలై 15న ప్రారంభమై..ఆగష్టు 12 అమావాస్యతో పూర్తవుతుంది...
ఆషాఢం శూన్య మాసం కావడంతో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనం సహా శుభకార్యాలు నిషేధిస్తారు. ఆషాడంలో శుభకార్యాలు నిర్వహించకపోయినా..ఇంటి నిర్మాణం చేపడితే మంచిది. ఈ నెలలో గృహనిర్మాణం మొదలుపెడితే ఆ గృహస్తులు ధనధాన్యాలు, పశుసంపద, రత్న మాణిక్యాలు లభిస్తాయని చెబుతోంది మత్స్యపురాణం. ఇది శూన్యమాసమే కానీ అపవిత్రమైనది కాదు. భక్తి, జపం, దానం, ఉపవాసం, స్నానం, పారాయణం చేయడం ఎంతో ఫలప్రదం. శరీరం-మనసు-ఆత్మ శుద్ధికి ఈ నెల అత్యుత్తమం. పూర్వకాలంలో అందరి ఇళ్లలో ఎక్కువగా కంచు, ఇత్తడి పాత్రలు ఉండేవి. ఆషాఢంలో వీటిని శుభ్రపరుచుకునే ఆచారం అంతా పాటించేవారు. వెండి ,బంగారు ఆభరణాలు కూడా ఈ నెలలోనే మెరుగు పట్టించుకునేవారు. వేసవి కాలం ముగిసి వానాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఆషాఢాన్ని సంధిమాసం అంటారు. వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమికీటకాలు విజృంభిస్తాయ్. అంటురోగాలు ప్రబలే సమయం. చర్మవ్యాధులు ఎక్కువగా ఉంటాయ్. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసం గోరింట పెట్టుకుంటారు.
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
ఆషాఢమాసంలో ఎన్నో విశేష దినాలున్నాయి.
బోనాలు
ఆధ్యాత్మిక సాధనకు పవిత్రమైన ఆషాఢం బోనాలతో ప్రారంభమవుతుంది. ఈ నెలరోజులు గ్రామదేవత పూజలతో ఊరూవాడా సందడిగా మారుతుంది. గ్రామదేవతలకు పొంగళ్లు పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుని...అమ్మవారిని ఆడబిడ్డలా ఇంటికి ఆహ్వానించి చీరలు,సారెలు సమర్పిస్తారు.
పూరీ జగన్నాథుడి రథయాత్ర ఆషాఢంలో వచ్చే అతిపెద్ద పండుగ జగాన్నేలే జగన్నాథుడి రథయాత్ర. మోక్ష ద్వారాలకు మార్గాన్ని చూపించే పూరీ జగన్నాథుడి రథయాత్ర చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు.
వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం
గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యేది కూడా ఈ నెలలోనే. శరన్నవరాత్రులు, చైత్ర నవరాత్రుల్లా ఈనెలలోనూ తొమ్మిది రోజులు తొమ్మిది మంది అమ్మవార్లను ఆరాధిస్తారు
10-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
స్కందవ్రతం
ఆషాఢ శుద్ధ షష్టి రోజు స్కందవ్రతం పేరుతో సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుంది.
తొలి ఏకాదశి - చాతుర్మాస దీక్ష
ఆషాఢమాసంలో విశేష పర్వదినం అయిన తొలి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగనిద్రలోకి జారుకుంటాడు..అందుకే శయన ఏకాదశి అంటారు. పీఠాధిపతులు, గురువులు, సాధువులు అంతా ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలు..కార్తీక శుద్ధ ఏకాదశితో ఈ దీక్ష ముగుస్తుంది. ఆషాఢ పూర్ణిమ-గురు పౌర్ణమి
ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమ అని వ్యాసపూర్ణిమ అని జరుపుకుంటారు. శ్రీమన్నారాయణుడి స్వరూపమైన వ్యాస భగవానుడి జన్మదినమైన ఈ రోజున గురువులను పూజిస్తారు. ఇంకా ఆషాఢ బహుళ సప్తమిని భోగ సప్తమిగా జరుపుకుంటారు..ఈ రోజు చెట్లను పూజిస్తారు..వానలు బాగా కురవాలని కోరుకుంటారు
ఆషాఢ బహుళ ఏకాదశి కామదా ఏకాదశిగా జరుపుకుంటారు..ఇహలోకంలో కోర్కెలు తీర్చి మోక్షాన్ని ప్రసాదించమని పూజలు చేస్తారు
పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
