Anant Chaturdashi Puja Vidhi 2025: శ్రీ మహావిష్ణువు అనంతరూపానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏటా అనంత చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువు అనంత రూపాన్ని పూజిస్తారు. ఏటా ఈ రోజుతోనే గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. భాద్రపద శుక్ల చవితి రోజు ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి వేడుకలు భాద్రపద శుక్ల చతుర్ధశితో ముగుస్తాయి. ఈ రోజునే అనంత చతుర్థశి..విష్ణుపూజ చేస్తారు. ఈ ఏడాది అనంత చతుర్థశి సెప్టెంబర్ 6 శనివారం వచ్చింది. అనంత చతుర్థశి పూజా సమయం, సూత్రం ప్రాముఖ్యత తెలుసుకుందాం. అనంత చతుర్దశి అంటే ?

అనంత చతుర్దశి అంటే 'అనంత' (అంతం లేనిది)  'చతుర్దశి' (పద్నాలుగవ రోజు). ఇది భాద్రపద మాసం యొక్క శుక్ల పక్షంలోని చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. దీనిని అనంత చౌదస్ అని కూడా అంటారు.

అనంత చతుర్దశి ముహూర్తం

భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థశి తిథి సెప్టెంబర్ 5 శుక్రవారం రాత్రి తెల్లవారుజామున ఒంటిగంట 41 నిముషాలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 06 శనివారం రాత్రి 1 గంట 03 నిముషాలవరకూ ఉంటుంది. ఈ ఏడాది గణేష్ నిమజ్జనం, అనంత చతుర్థశి వేడుకలు సెప్టెంబర్ 6న వచ్చాయి.  అనంత చతుర్దశి పూజా ముహూర్తం - ఉదయం 7.27 వరకూ దుర్ముహూర్తం ఉంటుంది..ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం లోగా పూజ పూర్తిచేయాలి అనంత చతుర్దశి ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం, అనంత చతుర్దశి వ్రతం రోజు విష్ణువును పూజిస్తే, అన్ని బాధలు తొలగిపోతాయి.  విద్యార్థులు తమ సబ్జెక్టులలో లోతైన జ్ఞానాన్ని పొందుతారు. ధనం కావాలనుకునే వారికి సంపద లభిస్తుంది. ఈరోజు భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజించేవారికి అనంతమైన దైవిక శక్తి , ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అనంత విశ్వాన్ని నడిపించే శ్రీ మహావిష్ణువు..అనంత బాధలు తొలగించి, అంతులేని సుఖాలను అందిస్తాడని నమ్ముతారు.  

అనంత సూత్రం ప్రాముఖ్యత

అనంత చతుర్దశి నాడు విష్ణువును పూజించిన తర్వాత అనంత సూత్రాన్ని చేతికి కట్టుకుంటారు. అనంత సూత్రంలో 14 ముడులు ఉండాలి, ఈ 14 ముడులను 14 లోకాలతో అనుసంధానించి ఉంటాయి. ఇది అన్ని దుఃఖాలు , పాపాల నుంచి రక్షిస్తుంది. అతనికి సుఖం, శ్రేయస్సు , దీర్ఘాయువును అందిస్తుంది.

అనంత చతుర్దశి పూజా విధానం (Anant Chaturdashi 2025 puja vidhi)

అనంత చతుర్దశి రోజు వేకువజామునే స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.పూజా స్థలంలో శ్రీ విష్ణువు, గణేష్ విగ్రహాలను ప్రతిష్టించాలి.చెక్క పీఠం ఏర్పాటు చేసి దానిపై సింధూరంతో 14 తిలకాలు దిద్దాలి.అనంత సూత్రాన్ని తయారు చేసి నూలు లేదా పట్టు దారంతో 14 ముడులు వేయాలి. ఈ ముడులు 14 లోకాలకు చిహ్నంగా ఉంటాయి.ఈ సూత్రాన్ని పంచామృతంతో శుద్ధి చేయాలిధూపం, దీపం, పువ్వులు, పండ్లు, తులసి సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠించాలిపూజ తర్వాత పురుషులు కుడి చేతిలో, మహిళలు ఎడమ చేతిలో అనంత సూత్రాన్ని కట్టుకోవాలి. దీనిని రక్షా సూత్రానికి చిహ్నంగా భావిస్తారు.ఈ రోజున గణేష్ విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేస్తారు. గణేష్‌ను భక్తితో వీడ్కోలు పలకాలి.

అనంత చతుర్దశి నియమాలు (Anant Chaturdashi 2025 Rules)

అనంత చతుర్దశి సందర్భంగా కట్టిన రక్షా సూత్రాన్ని కనీసం ఒక సంవత్సరం పాటు ఉంచుకోవాలి. ఏదైనా కారణం వల్ల ఇది సాధ్యం కాకపోతే, రక్షా సూత్రాన్ని కనీసం 14 రోజులైనా ఉంచాలి..ఈ లోగా తీయకుండా ఉంచాలిఉదయం సమయంలో పూజ చేయలేకపోతే అనంత చతుర్థశి రోజు సాయంత్రం అయినా పూజ చేయొచ్చుఈ రోజు శ్రీ విష్ణువుతో పాటు వినాయకుడిని పూజించాలితామసిక ఆహారం తీసుకోవద్దు.. 

అనంత చతుర్దశి ప్రాముఖ్యత (Anant Chaturdashi 2025 Significance)

అనంత స్వరూపానికి అంకితమైన అనంత చతుర్థశి  అపారమైన శక్తికి, విశ్వాసానికి చిహ్నం.ఈ రోజున గణేష్ ఉత్సవం కూడా ముగుస్తుంది.పురాణాల ప్రకారం, ఎవరైనా ఈ రోజున శ్రద్ధతో, నియమాలతో వ్రతం చేస్తారో కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి, శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు.  ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.