Tirumala Tirupati Laddu: లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధి కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. ఎందుకంటే హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటి కన్నా తిరుమల లడ్డూ రుచి , ప్రాముఖ్యత వేరు.
తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులతో ఏడుకొండలు కళకళలాడిపోతుంటాయి. వచ్చిన ప్రతి భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకునేవెళతారు. ప్రసాదం పంచింపెడితే మరింత పుణ్యం అన్న పండితుల మాటని పరిగణలోకి తీసుకుని భారీగా ప్రసాదం కొనుగోలు చేసి తీసుకెళ్లిమరీ పంచుతుంటారు..
కొందరైతే శ్రీ వేంకటేశ్వరుడిపై భక్తి, విశ్వాసం ఉన్నా లేకున్నా..లడ్డూపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.ఎందుకంటే ఆ రుచి వేరు అంతే.. ఎవరైనా తిరుమల వెళ్లొచ్చాం అని చెప్పగానే దర్శనం ఎలా జరిగింది అనే మాటకన్నా...లడ్డూ ఏది అని అడుగుతారు.. అంతలా భక్తులకు చేరువైంది శ్రీ వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం..
Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!
తిరుమల లడ్డూ రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే ఈ లడ్డుకు Geographical Patent లభించింది..అందుకే తిరుపతి లడ్డూని ఎవరూ అనుకరించకూడదు..
నిత్యం కొండపైకి వచ్చే భక్తులకోసం లక్షల లడ్డూలు తయారు చేస్తుంటారు... అప్పట్లో కట్టెల పొయ్యిపై చేసేవారు..ఇప్పుడు ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు లడ్డూ తయారీకోసమే పనిచేస్తారు.
స్వామివారికి నివేదించే...భక్తులకు అందించే లడ్డూలు 3 రకాలున్నాయి...
ఆస్థాన లడ్డు
ఆస్థాన లడ్డుని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి వీవీఐపీలకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఆశీర్వచనం అనంతరం అందిస్తారు. ఈ లడ్డూని సాధారణంగా విక్రయించరు. దీని బరువు 750 గ్రాములు...ఇందులో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, కుంకుమపూవు, ముంతమామిడిపప్పు లాంటి ప్రత్యేక దినుసులను ఉపయోగిస్తారు. ఈ రుచి వర్ణించేందుకు మాటలు సరిపోవు...
Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
కళ్యాణోత్సవ లడ్డు
కల్యాణోత్సవ లడ్డూని... ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు, భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీని బరువు సుమారు 700 గ్రాములు. కళ్యాణోత్సవం సహా ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులకు దర్శనానంతరం ఈ లడ్డూని అందిస్తారు. దీని ధర 200 రూపాయలు. కళ్యాణోత్సవ లడ్డూలు కౌంటర్లో అందుబాటులో ఉన్నాయి..
సాధారణ లడ్డు
సాధారణ లడ్డూలనే ప్రోక్తం లడ్డూ అని కూడా పిలుస్తారు. వీటిని సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు అందిస్తారు. ఆలయం వెనుకభాగంలో ఉన్న లడ్డూ కౌంటర్లలో వీటిని విక్రయిస్తారు. ఆర్జితసేవలలో పాల్గొన్న భక్తులకు ఇవి ఉచితంగా ఇస్తారు. దీని బరువు 175 గ్రాములు.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
లడ్డూ అనే పేరెలా వచ్చింది!
హిబ్రూలో LUD అనే పదాన్నిలడ్డూకు సమానార్ధకంగా చెబుతారు..ముద్దగా చేయడాన్నే లడ్డూగా పేర్కొన్నారు. సంస్కృతంలో లడ్డుకం, లాడుకము, లట్టీకము... తెలుగులో అడ్డుకము, లడ్వము... తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక అంటారు. మానసోల్లాస గ్రంథంలో వీటి ప్రస్తావన ఉందని పండితులు చెబుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు, తిరుమల అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....