Vidur Niti In Telugu : విదుర నీతిలో ఒక వ్యక్తి ఎందుకు దరిద్రుడు అవుతాడో తెలిపాడు. కొందరు ఎంత ప్రయత్నించినా వారికి భగవంతుని ఆశీర్వాదం లభించదు. అలాంటి వారికి రోజూ ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. వారి ప్రయత్నాలు కేవలం వృధాగా మిగులుతాయి. విదురుడు చెప్పినట్టు మనం ఏ తప్పులు చేస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది.? మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారేమో గమనించుకోండి.
1. వికారమైన వ్యక్తులు
విదుర నీతి ప్రకారం, తన ఇంటిని మురికిగా ఉంచుకునే వ్యక్తి లేదా తన శరీరాన్ని అపరిశుభ్రంగా ఉంచుకునే వ్యక్తి ఎల్లప్పుడూ పేదరికంలో ఉంటాడు. అలాంటి వారు ఎంత కష్టపడి పనిచేసినా సంపదను అనుభవించలేరు, భగవంతుడు కూడా అలాంటి వారిని అనుగ్రహించడు. ధనవంతులు కావాలనుకునేవారు లేదా భగవంతుని అనుగ్రహం పొందాలనుకునే వారు పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Also Read : Vidura Niti In Telugu: ఈ 4 అంశాలకు దూరంగా ఉంటే విజయం సాధిస్తారు!
2. పెద్దలను అగౌరవపరచడం
విదురుడు చెప్పినట్లు పెద్దలను గౌరవించాలి. మనం వారికి సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉంటే తప్పకుండా చేయాలి. పెద్దలను గౌరవించని వ్యక్తి, పెద్దల గురించి ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడేవాడు, అలాంటి వ్యక్తులు వారి జీవితంలో డబ్బు సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూనే ఉంటారు. అందుకే మనం మన ఇంటి పెద్దలను ఎప్పుడూ అగౌరవపరచకూడదు.
3. శ్రమకు దూరంగా ఉండేవారు
మనం చేస్తున్న పని కష్టమైనదైనా, సులువైనదైనా.. మన దృష్టి మాత్రం చేయడంపైనే ఉండాలి. మనం చేస్తున్న పని కష్టం అని సగంలో విరమించకూడదు. కష్టపడి పనిచేసే వ్యక్తులు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటారు. ఈ వ్యక్తులకు డబ్బు సమస్యలు చాలా అరుదు. కూర్చొని పురోభివృద్ధి, ఉపాధి, సాఫల్యం కోరుకునే వారికి సులువుగా లభించడం అసాధ్యం. ఏదైనా సాధించాలంటే కష్టపడాలి.
4. దేవుణ్ణి నమ్మని వారు
దేవుణ్ణి నమ్మని వ్యక్తి తన జీవితమంతా డబ్బు సమస్యలతో గడుపుతాడు. తన పనిలో విజయం సాధించాలనుకునే వ్యక్తికి ముందుగా భగవంతునిపై నమ్మకం ఉండాలి. భగవంతుడిని నమ్ముకున్న వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే దేవుడు వచ్చి ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడని నమ్మకం. ఏదైనా పనిని ప్రారంభించే ముందు భగవంతుడిని స్మరించుకుని ఆ తర్వాత పని ప్రారంభించండి. ఇది మీకు పనిలో విజయాన్ని ఇస్తుంది.
Also Read : Vidura Niti In Telugu: ఈ 5 గుణాలు మీకుంటే మీ జీవితం ఆనందమయం
విదురుడు ప్రకారం, ఈ 4 లక్షణాలు ఉన్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా జీవితంలో డబ్బు లేదా సంపదను అనుభవించలేడు. ధనాగమనం కావాలంటే ముందుగా పై 4 తప్పులు చేయకూడదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.