Jyeshta Maas Food: పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసం సంవత్సరంలో మూడవ మాసం. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం మే 20వ తేదీ నుంచి ప్రారంభమై ఈ నెల‌ 18వ తేదీన‌ ముగుస్తుంది. జ్యేష్ఠ మాసానికి సంబంధించి అనేక నియమాలు గ్రంధాలలో ఉన్నాయి. వీటిని పాటిస్తే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఆహారానికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. శాస్త్రాలలో, భారతీయ సంప్రదాయంలో, రుతువులను బట్టి తినవలసిన ఆహారాలు.. త్రాగవలసిన పానీయాల గురించి నియమాలు ఉన్నాయి. జేష్ఠ మాసంలో మన ఆహారం ఎలా ఉండాలో తెలుసుకుందాం.


Also Read : జ్యేష్ఠమాసం మొదలైంది - ఈ నెలలో ఎన్ని విశిష్ఠమైన రోజులున్నాయో తెలుసా!


శాస్త్రాలలో కాలానుగుణ ఆహారం
చైత్రమాసంలో బెల్లం, వైశాఖ మాసంలో నూనె, జ్యేష్ఠమాసంలో మిరపకాయలు, ఆషాఢమాసంలో పప్పులు, శ్రావణమాసంలో పచ్చిమిర్చి, భాద్రపద మాసంలో పెరుగు తినాలని చెబుతారు. కార్తీక మాసం, పుష్య మాసంలో ధనియాలు. మాఘమాసంలో పంచదార, ఫాల్గుణ మాసంలో పప్పు దినుసులు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఆచారాలను అనుసరించి ఆహారం తీసుకోవాలని శాస్త్రాలలో స్ప‌ష్టంగా తెలిపారు. కాలానుగుణంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ప్రమాదకరమైన వ్యాధులను నిరోధించే అవ‌కాశం ఉంటుంది.


జేష్ఠ మాసంలో ఈ ఆహారం వ‌ద్దు
జ్యేష్ఠ మాసంలో తినవలసిన ఆహారాలు, త్రాగవలసిన పానీయాల గురించిన‌ నియమాలను తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో ఏదైనా తినడం, త్రాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో ముఖ్యంగా నూనెలు, మ‌సాలాల‌తో త‌యార‌య్యే ఆహారానికి దూరంగా ఉండాలి. జ్యేష్ఠ మాస సమయంలో అధిక నూనె-మసాలా ఆహారం, వేయించిన ఆహారానికి దూరంగా ఉండటం ప్రయోజనకరం.


మహాభారతంలో జ్యేష్ఠ మాసపు ఆహారం
జ్యేష్ఠ మాసపు ఆహారం గురించి మహాభారతంలో ఇలా చెప్పారు- 'జ్యేష్ఠమూలం తు యో మస్మేకభక్తేన్ సంక్షిపేత్| ఐశ్వర్యమతులం శ్రేష్ఠం పుమంస్త్రి వా ప్రపద్యతే|' అంటే జ్యేష్ఠ మాసంలో రోజుకు ఒక్కసారే భోజనం చేయండి. ఇది వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచ‌డ‌మే కాకుండా ఉత్సాహంగా ప‌నిచేసేలా చేస్తుంది అని అర్థం.


ఇలాంటి ఆహారాన్ని తినవద్దు
జ్యేష్ఠ మాసంలో, మీరు మీ ఆహారంలో సీజనల్ పండ్లు, ఆకుపచ్చని కూరగాయలను చేర్చుకోవాలి. అలాగే ఈ మాసంలో మాంసాహారం తీసుకోకూడదు.


Also Read : ఈ విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తే అదృష్టం మీ వెంటే


ద్ర‌వ‌ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి
ఈ నెలలో వీలైతే, మీ ఆహారంలో ఎక్కువ ద్రవ పదార్థాలు (పెరుగు, మజ్జిగ, లస్సీ, జ్యూస్ మొదలైనవి) చేర్చుకోండి. ఎందుకంటే స్పైసీ ఫుడ్ మీకు మైకం లేదా నరాల సమస్యలను కలిగిస్తుంది.


వంకాయ ముట్టుకోవద్దు
జేష్ఠ మాసంలో వంకాయను ఆహారంలో చేర్చుకోవద్దు. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభవం చూపుతుంది. ఆర్థరైటిస్ అవకాశాలను పెంచుతుంది. జ్యేష్ఠ మాసంలో బెండకాయ తింటే సంతానానికి సమస్యలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.