Chanakya niti: భార్యాభర్తల మధ్య సంబంధాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అర్థం చేసుకునే సామర్థ్యంపై ఆధార‌ప‌డి ఉంటాయి. పరస్పర అవ‌గాహ‌న‌ లోపించిన ఇళ్లలో తరచూ గొడవలు, వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ విషయంలో అవ‌గాహ‌న‌ లోపించిన ఇళ్లలో అశాంతి, విషాద వాతావరణం నెల‌కొని ఉంటుంది. అశాంతి, మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు శత్రువులుగా భావించడం ప్రారంభిస్తారు. భార్యాభర్తల మధ్య బాంధవ్యం బాగాలేకపోతే ఒకరికొకరు శత్రువులవుతారు. చాణక్య నీతి ప్రకారం, భర్త తన భార్యకు ఏ పరిస్థితుల్లో శత్రువు అవుతాడో తెలుసుకుందాం.


ఈ ల‌క్ష‌ణాలున్న భార్యకు భర్తే శత్రువు


ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్త్రీ చెడు స్వభావం కలిగి ఉంటే, అసంబద్ధమైన పనులు చేస్తే, పరాయి పురుషుల పట్ల ఆకర్షితురాలైతే, ఆమె భర్త ఆమెకు మొదటి శత్రువు. బాధ్యతారహితంగా ప్రవర్తించే భార్యను భర్త అడ్డుకుంటే.. ఆమె భర్తను శత్రువులా చూస్తుంది. భార్యాభర్తలిద్దరూ దుర్మార్గపు స్వభావం కలిగి ఉంటే, మరొకరు దాని దుష్పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. భార్య చేసిన తప్పులకు భర్త, భర్త చేసిన తప్పులకు భార్య శిక్ష అనుభవించాలి. ఈ కారణంగా, భార్యాభర్తలిద్దరూ వైవాహిక జీవితంలో తెలివిగా జీవించాలి.


అత్యాశ గల వ్యక్తి


ఆచార్య చాణక్యుడు అత్యాశపరుడి మనస్సు ఎప్పుడూ సంపద గురించి ఆలోచిస్తుందని తెలిపాడు. అలాంటి వారు తమ ప్రాణం కంటే డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎవరైనా తమ ఇంటికి డబ్బు అడగడానికి వస్తే, అప్పు అడగడానికి వచ్చిన వ్యక్తిని శత్రువులా చూస్తారు. అదే సమయంలో, దాతృత్వం, ధార్మిక పనులు వారికి పనికిరావు.


మూర్ఖుడి స్వభావమే అతని అజ్ఞానానికి కారణం


ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తిని మూర్ఖులు శత్రువుగా పరిగణిస్తారు. బుద్ధిహీనుడి ముందు ఎవరైనా ఉపన్యాసం చేస్తే, వారు పండితులను తమ ప్రధాన శత్రువుగా చూస్తారు. తెలివిగల మాటలు మూర్ఖుడిని ఇబ్బంది పెడ‌తాయి. ఎందుకంటే అతను ఈ విషయాలను అనుసరించడానికి అంగీకరించడు. మూర్ఖుడి స్వభావం అతన్ని జ్ఞానానికి దూరంగా ఉంచుతుంద‌ని ఆచార్య చాణ‌క్యుడు తెలిపాడు.


చంద్రుడు దొంగలకు శత్రువు


దొంగలు తమ పనిని చీకట్లో మాత్రమే చేస్తారు. ఎందుకంటే చీకటిలో వారిని ఎవరూ గుర్తించరు. చీకటిలో చంద్రుడు వారికి శత్రువులా కనిపిస్తాడు. చంద్రుడు రాత్రికి కాంతిని ఇస్తాడు. చంద్రకాంతిలో దొంగ సులభంగా దొంగిలించలేడు. కాబట్టి దొంగలు చంద్రుడిని తమ శత్రువుగా చూస్తారు.


అసూయపడే వ్యక్తులకు దూరంగా ఉండండి


మనతో మధురంగా ​​మాట్లాడే వారితో ఎప్పుడూ స్నేహంగా ఉండకండి, వారితో ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. లేదా స్నేహితులను చేసుకోకండి. ఈ ల‌క్ష‌ణాలు ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా మోసం చేయవచ్చు. అసూయపడే స్నేహితులకు దూరంగా ఉండండి. శత్రువుల కంటే అలాంటి స్నేహితుల స్నేహం ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని చాణ‌క్యుడు చెప్పాడు. కాబట్టి, అలాంటి వారితో స్నేహాన్ని కొనసాగించడం మానుకోవాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించగలరు.