Akshara Devalla Kuchipudi dancer 

14 ఏళ్ల చిన్నారి కూచిపూడి రంగప్రవేశం

రెండున్నర గంటల పాటు సాగిన అభినయం

భామాకలాప ప్రదర్శన చూసి సత్యభామే దిగి వచ్చిందా అని మంత్రముగ్ధులైన ప్రేక్షకులు

భామాప్రవేశం పేరుతో హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై జరిగిన ప్రదర్శన

అతి చిన్న వయస్సులోనే భామా కలాపం ప్రదర్శించిన చిన్నారిగా రికార్డ్ క్రియేట్ చేసిన అభినవ సత్యభామ అక్షర దేవళ్ల

 కూచిపూడి నాట్య సంప్రదాయంలో అత్యంత శోభాయమానమైన భామాకలాపాన్ని 14 ఏళ్ల అక్షర దేవళ్ల  అత్యద్భుతంగా ప్రదర్శించి  ఐదు అంతర్జాతీయ, జాతీయ స్థాయి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. తన కూచిపూడి రంగ ప్రవేశాన్ని భామాప్రవేశం పేరుతో  రవీంద్రభారతి వేదికపై అక్షర దేవళ్ల రసరమ్యంగా ప్రదర్శించింది. 

కూచిపూడి పితామహుడు సిద్ధేంధ్రయోగి రచించిన భామా కలాపాన్ని..సాధారణంగా సీనియర్ కళాకారులు గంట సమయానికి కుదించి ప్రదర్శిస్తారు. అయితే అక్షర దేవళ్ల సంప్రదాయ పరంగా దీనిని పూర్తి రూపంలో రెండు గంటల 30 నిమిషాలపాటు  నిరంతరాయంగా ప్రదర్శించి  తన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది అక్షర.

సంగీతం,సంభాషణ, గానం, ఆహార్యం , అభినయం, హావభావ సమ్మేళిత సంపూర్ణ నృత్యనాటకం భామాకలాపం. నిజంగా సత్యభామే దిగి వచ్చిందా అన్నట్టు శృంగార, వీర, విరహ రసాలతో కూడిన సత్యభామ పాత్రలో పరకాయప్రవేశం చేసింది అక్షర.  సత్యభామలా గర్వాన్ని నఖశిఖపర్యంతం చూపిస్తూనే శ్రీకృష్ణుడు తనకు దూరమయ్యాడన్న విరహవేదనను కూడా అంతే లాఘవంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంది. అక్షర దేవళ్ల చేసిన ఈ అసాధారణ నాట్యప్రదర్శనను...

ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్

గోల్డెన్ స్టార్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్

జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్  గుర్తించాయి. రికార్డు సర్టిఫికెట్లను ఆ సంస్థల ప్రతినిధులు హాజరై స్వయంగా చిన్నారి అక్షరకు అందజేశారు.

కూచిపూడి నృత్యాన్ని తన తల్లి కూచిపూడి గురు భావన పెదప్రోలు దగ్గర నేర్చుకుంది అక్షర. మూడో ఏటే నేర్చుకోవడం ప్రారంభించిన అక్షర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ మధ్యే అమెరికాలో నిర్వహించిన తానా మహాసభల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న అక్షర, అక్కడా తన నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 

కూచిపూడి నృత్యకారిణిగానే కాదు బాలనటిగా అక్షర టాలీవుడ్ లో 15 సినిమాల్లో నటించింది. ఈ మధ్య నితిన్ తమ్ముడు సినిమాలోనూ అక్షర మంచి పాత్ర పోషించింది. అక్షర నాట్యప్రదర్శనలు చూసి ముగ్దులైన శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామీజీ తన ఆశ్రమానికి సాంస్కృతిక రాయబారిగా  నియమించారు. 

ఇప్పుడు భామాకలాపం రికార్డు ప్రదర్శనతో కూచిపూడి ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది అక్షర సంపాదించుకుంది. ఈ  రంగప్రవేశం కార్యక్రమానికి హాజరైన కూచిపూడి గురువులు చిన్నారి అక్షరను ఆశీర్వదించారు

శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి...12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయి, వాటి విశిష్టత ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి