Toyota Hyryder SUV Price And Features In Telugu: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అనేది హైబ్రిడ్ SUV. ఇంధన సామర్థ్యం & ఆకర్షణీయమైన రూపం కారణంగా ఈ కారును ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. మీరు ఈ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ తక్కువ ధరకు పొందవచ్చో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది.
దిల్లీ & ముంబైలో ధర ఎంత?
దిల్లీలో టయోటా హైరైడర్ బేస్ వేరియంట్ "E NeoDrive మైల్డ్ హైబ్రిడ్" వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలు. ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.27 లక్షలు. ఇందులో RTO టాక్స్, బీమా & ఇతర ఛార్జీలు కూడా ఉన్నాయి. ముంబైలో దీని ఆన్-రోడ్ ప్రైస్ రూ. 13.48 లక్షలు. అంటే, ఈ SUV బేస్ వేరియంట్‌ను ముంబైలో కంటే దిల్లీలో రూ. 21 వేల తక్కువ ధరకు కొనవచ్చు, ఈ డబ్బు మీకు ఆదా అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధర
హైదరాబాద్‌లో టయోటా హైరైడర్ బేస్ వేరియంట్ "E NeoDrive మైల్డ్ హైబ్రిడ్" వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలు. ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.94 లక్షలు. దీనిలో ఎక్స్-షోరూమ్ ధరకు అదనంగా RTO టాక్స్ దాదాపు 1.98 లక్షలు, బీమా దాదాపు రూ. 51,000 & ఇతర ఛార్జీలు దాదాపు రూ. 12,000 కలిసి ఉన్నాయి.
వరంగల్‌లో, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలు. ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.97 లక్షలు. RTO టాక్స్‌లో స్వల్ప తేడా వల్ల, హైదరాబాద్‌తో పోలిస్తే ఈ నగరంలో ఆన్-రోడ్ రేటు రూ. 3,000 పెరిగింది.
విజయవాడలోనూ ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలే అయినప్పటికీ, ఆన్-రోడ్ ధర మాత్రం దాదాపు రూ. 14.59 లక్షలు అవుతుంది. దీనిలో ఎక్స్-షోరూమ్ ధరకు అదనంగా RTO టాక్స్ దాదాపు 2.10 లక్షలు, బీమా దాదాపు రూ. 1.02 లక్షలు & ఇతర ఛార్జీలు దాదాపు రూ. 12,000 కలిసి ఉన్నాయి.
విశాఖపట్నంలో, ఇదే వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.34 లక్షలు కాగా, ఆన్-రోడ్ ధర మాత్రం దాదాపు రూ. 14.64 లక్షలు అవుతుంది. RTO టాక్స్, బీమా ప్రీమియం పెరగడం వల్ల, విజయవాడతో పోలిస్తే, ఈ సముద్ర తీర నగరంలో ఈ కారు రేటు రూ. 5,000 పెరిగింది.
దీనిని బట్టి, ఆంధ్రప్రదేశ్ &తెలంగాణలో, టయోటా హైరైడర్ SUVని హైదరాబాద్‌లో కాస్త తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు, డబ్బు మిగిల్చుకోవచ్చు.
టయోటా హైరైడర్ SUV ఫీచర్లుహైరైడర్ SUVలో... 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ & 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు & 360-డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి. ఈ SUV మూడు ఇంజిన్ ఎంపికలలో (1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) & 1.5-లీటర్ CNG ఇంజిన్) అందుబాటులో ఉంది.
మైలేజ్ దీని ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో... 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ & e-CVT ఉన్నాయి. పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్ 1 లీటరుకు 27.97 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. CNG వేరియంట్ మైలేజ్ కిలోగ్రాముకు 26.6 కి.మీ.గా కంపెనీ వెల్లడించింది.
మీరు ఈ కారును కార్ లోన్‌పై కూడా కొనవచ్చు. బ్యాంక్ లోన్ & వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. ఖచ్చితమైన సమాచారం కోసం, మీరు సమీపంలోని టయోటా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.