The Mystery Of 360 Degree Rotating Shivling: మనదేశంలో వాడకో ఆలయం ఉంటుంది. శివాలయాల సంఖ్యకు లెక్కేలేదు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచభూత లింగాలు, పంచారామాలు సహా ఎన్నో విశిష్టమైన ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి ఛత్తీస్‌గఢ్ బర్సూర్ లో ఉంది. ఈ ఆలయాన్ని బత్తీస్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 32 స్తంభాలు, రెండు గర్భగుడులు అత్యంత విశిష్టం. రెండు గర్భగుడులు ఉండే ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ కొలువైన శివలింగం 360 డిగ్రీలు తిరుగుతుంది. భక్తులు శివలింగం తిప్పుడూ ఏదైనా కోరుకుంటే శివయ్య నెరవేరుస్తాడని విశ్వాసం. రాజమహర్షి గంగామహాదేవి 1208లో  ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది 

ఇలాంటి లింగమే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉంది. బాబా మహాకాల్ ఆలయానికి సమీపంలో రామేశ్వరాలయంలో ఉండే శివలింగం 360 డిగ్రీలు తిరుగుతుంది. ఈ శివలింగాన్ని రామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా ప్రతిష్టించాడని చెబుతారు. ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకున్నంత ఫలితం దక్కుతుందని   నమ్ముతారు.  

సాధారణంగా ఏ ఆలయంలో అయినా శివలింగం నీటి ముఖం ఉత్తర దిశలో ఉంటుంది. కానీ బత్తీస్ మందిర్, రామేశ్వరాలయంలో ఉండే శివలింగాన్ని ఏ దిశలో అయినా తిప్పుకోవచ్చు.  

జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాలు ఇవే

సోమనాథ్: గుజరాత్‌లోని సోమనాథ్

మల్లికార్జున: ఆంధ్రప్రదేశ్, శ్రీశైలం 

మహాకాళేశ్వర్: మధ్యప్రదేశ్, ఉజ్జయిని

ఓంకారేశ్వర్: మధ్యప్రదేశ్, ఓంకారక్షేత్రం

కేదార్నాథ్: హిమాలయాలు

భీమేశ్వర: మహారాష్ట్ర

విశ్వనాథ: ఉత్తరప్రదేశ్, కాశీ 

త్రయంబకేశ్వర్: మహారాష్ట్ర

వైద్యనాథ: బీహార్

నాగేశ్వర్: గుజరాత్, ద్వారకా

రామేశ్వరం: తమిళనాడు

ఘృషెష: మహారాష్ట్ర, ఎల్లోరా గుహలు

పంచభూత లింగాలు

పృథ్వి లింగం (భూమి): కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం

జల లింగం (నీరు): జంబుకేశ్వరంలో జలలింగం

తేజో లింగం (అగ్ని): తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడు

వాయు లింగం (గాలి): కాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర లింగం

ఆకాశ లింగం (ఆకాశం): చిదంబరంలో నటరాజ స్వామి

పంచారామాలు

సోమారామం- పశ్చిమగోదావరి జిల్లా భీమవరం

ద్రాక్షారామం - కోనసీమ జిల్లా రామచంద్రాపురం

కుమారారామం -కాకినాడ జిల్లా సామర్లకోట

క్షీరారామం -  పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు

అమరారామం - అమరావతి

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయనిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై "న" కారాయ నమశివాయ

మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయమందార ముఖ్య బహుపుష్ప పూజితాయతస్మై "మ" కారాయ నమశివాయ

శివాయ గౌరీ వదనారవిందసూర్యాయ దక్షాధ్వర నాశనాయశ్రీ నీలకంఠాయ వృషభద్వజాయతస్మై "శి" కారాయ నమశివాయ

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాదిమునీంద్ర దేవార్చిత శేఖరాయచంద్రార్క వైశ్వానర లోచనాయతస్మై "వ" కారాయ నమశివాయ

యక్షస్వరూపాయ జటాధరాయపినాకహస్తాయ సనాతనాయసుదివ్యదేహాయ దిగంబరాయతస్మై "య" కారాయ నమశివాయ

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌశివలోక మవాప్నోతి శివేన సహ మోదతే 

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!

 తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి