YSRCP Politics :  వైఎస్ఆర్‌సీపీలో మేధోమధనం ప్రారంభం అయ్యింది. ప్రతిపక్షాల పై ఎదురు దాడి చేస్తూనే వ్యూహత్మకంగా వ్యవహరించాలని నాయకత్వం భావిస్తోంది .ఇందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకునేందుకు నియోజకవర్గాల వారీగా ఉన్నపరిస్దితులను అగ్ర నాయకులు ఆరా తీస్తున్నారు.  ఇప్పటికే జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు  మెదలు పెట్టారు.అటు ప్రతిపక్ష పార్టీలు ఎకం కావాలని నిర్ణయం దాదాపుగా ఖారారు అయింది. వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. 


పవన్ - చంద్రబాబు భేటీ తర్వాత మారిపోయిన రాజకీయాలు !


ఏపీలో ఏడాదిన్నర ముందుగానే ఎన్నికల సందడి మెుదలైంది.ఇప్పటికే ఎన్నికలకు సంబందించిన అంశాలు పై ప్రదాన పార్టీలు అన్ని సమాయత్తం అవుతున్నాయి. విశాఖ పట్టణం  ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత రాజకీయాల సమీకరణాలు కూడా మారిపోయాయి.ఇప్పటి వరకు జనసేన, బీజేపి పొత్తులో ఉన్న విషయం బహిరంగమే. అయితే విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన తరువాత ప్రతిపక్ష పార్టీలన్నీ జనసేన అదినేతకు మద్దతు ఇచ్చాయి.కాంగ్రెస్ తో పాటుగా వామపక్షాలు,టీడీపీ కూడ జనసేనకు సపోర్ట్ గా , వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు చేశాయి .అంతే కాదు టీడీపీ అదినేత చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి  జనసేన అదినేత తో సమావేశం అయ్యారు .దీంతో రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి.


టీడీపీ, జనసేనలను ధీటుగా తిప్పికొట్టేలా వైఎస్ఆర్‌సీపీ ఎదురుదాడి !


ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు గమనిస్తున్నారు.  తాము ముందు నుండి చెబుతున్న విధంగా జనసేన, టీడీపీ వేర్వేరు కాదని రాజకీయంగా ఎకం అయ్యి,పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నారని వైసీపీ విమర్శలు ప్రారంభించింది.  అదే స్దాయిలో టీడీపీ నేతలు కూడ వైసీపీ కి కౌంటర్ ఇచ్చారు.  ఆంధ్రప్రదేశ్ లో జనసేన,టీడీపీ కీలకం..బీజేపికి కేంద్రంలో పట్టు ఉన్నప్పటికి ఏపీలో రాజకీయంగా ప్రభావితం చేసే పరిస్దితి లేకపోవటంతో, వామపక్షాలను కలుపుకొని టీడీపీ, జనసేన ఎన్నికలకు వెళ్లేందుకు రూట్ క్లియర్ అయ్యిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.  వైసీపీ కూడ తన రూట్ మ్యాప్ ను రెడీ చేసుకుటోంది.  జనసేనను టార్గెట్ చేసి ఇప్పటికే సీఎం జగన్ మెదలుగొని వైసీపీ నేతలంతా రాజకీయ విమర్శలకు తెరతీశారు. 


సంక్షే పథకాలనే హైలెట్ చేసి ప్రజల్లోకి వెళ్లాలనే వ్యూహం !


ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలపై కూడా జగన్ దృష్టి పెట్టారు. విపక్ష పార్టీలు  కలసి పోటీ చేస్తే ప్రబావం ఎలా ఉంటుంది, వైసీపీ ఎదుర్కోవాల్సిన విషయలు పై జగన్ ప్రత్యేకంగా నేతలతో మాట్లాడుతున్నారు.  రాజదాని అంశం, పోలవరం అంశాలు, తెర మీద కనిపిస్తున్నా ,ఎన్నికల్లో వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.  దీంతో సంక్షేమం పైనే జగన్ సర్కార్ మెదటి నుండి ఆదారపడి,ఇ చ్చిన హామిలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రోడ్లు కూడ బాగు చేయలేని పరిస్దితుల్లో జగన్ ప్రభుత్వం పాలన సాగిస్తుందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే వీటిని కూడ జగన్ అంతగా పట్టించుకోవటం లేదు. 


అసమ్మతికి తావు లేకుండా అవసరమైతే పార్టీ నేతల సస్పెండ్ ! 


ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా పార్టి పటిష్టత, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పని తీరు, ఇంచార్జ్ ల పరిస్దితులు పైనే జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టారని పార్టి నాయకులు చెబుతున్నారు. పార్టి కేంద్ర కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు,ఇంఛార్జులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వెళుతున్నాయి. నియోజకవర్గంలో అసమ్మతికి తావులేకుండా అవసరం అయితే నాయకులను కూడ సస్పెండ్ చేసి, పార్టిలో క్రమశిక్షణకు ప్రాదాన్యత ఇస్తున్నామనే సందేశాన్ని కూడా ఇప్పటికే క్యాడర్ కు పంపారు.