YSRCP cadre suffered heavy losses :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. పార్టీ విజయం సాధిస్తందని ఎంతో నమ్మకం పెట్టుకున్న వారికి అనుకున్న ఫలితం రాకపోగా ఆ నమ్మకంతో పెట్టిన బెట్టింగు్ల్లోనూ భారీ లాస్ రావడంతో అనేక మంది కుదేలయ్యారు. ఈ పరిణామాలతో పాటు కొన్ని చోట్ల గొడవల కారణంగా ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఓ తాజా మాజీ అధికార పార్టీలో నిస్తేజం కనిపిస్తోంది. 


తీవ్రంగా దెబ్బతీసిన బెట్టింగులు                                  


వైసీపీ క్యాడర్ ను బెట్టింగులు తీవ్రంగా దెబ్బతీశాయి.  మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ వైసిపి కార్యకర్తలు, నాయకులు భారీ మొత్తంలో పందేలు వేశారు. సామాన్య కార్యకర్తలు కూడా పందేలు వేశారు. జిల్లాలో కోట్ల రూపాయలు బెట్టింగ్‌లు జరిగాయి. వైసిపి ఓటమితో ఆ పార్టీ కార్యకర్తలు పూర్తిగా నష్టపోయారు. కొందరు రూ.కోట్లు విలువ చేసే భూములు పోగొట్టుకున్నారు. వైసిపిని నమ్ముకుని ఇప్పుడు మునిగిపోయామంటూ పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.  ఒకటికి ఐదు రెట్లు వస్తుందంటూ ఆశపడ్డ కార్యకర్తలు కూడా కుదేలయ్యారు. జనంలో ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేక బెట్టింగ్‌లు కట్టి నష్టపోయారు.


సీఎం జగన్, కొన్ని ఎగ్టిట్ పోల్స్ తో మరింత నష్టం                       


నిజానికి పోలింగ్ శాతం బాగా పెరగడంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిందని ఎక్కువ మంది విశ్లేషించారు. వైసీపీకి ఓటమి ఖాయమన్న ప్రచారం జరగడంతో సీఎం జగన్ రెండు రోజుల తర్వాత ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి.. దేశం మొత్తం తిరిగి చూసే విజయాన్ని  సాధిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో అప్పటి వరకూ కాస్త డౌట్ గా ఉన్న వైసీపీ శ్రేణులు.. తర్వాత మళ్లీ పందేలు కట్టారు. ఈ క్రమంలో ఎగ్టిట్ పోల్స్ తమకే అనుకూలంగా వచ్చాయని వైసీపీ నేతలు చెప్పడం.. ఓ సర్వే పై విపరీతంగా చర్చ జరగడంతో చివరి రోజుల్లోన పందేలు కాసినట్లుగా తెలుస్తోంది. 


రెచ్చగొట్టిన టీడీపీ శ్రేణులు                     


వైసీపీ గెలుపుపై నమ్మకం ఉంటే బెట్టింగులు కాయాలని టీడీపీ శ్రేణులు కూడా రెచ్చగొట్టాయి. రూపాయి పెడితే ఐదురూపాయలు ఇస్తామన్న స్థాయిలో పందేలు కాయడంతో వస్తే ఐదు లక్షలు.. పోతే లక్ష అనుకున్నట్లుగా కూడా పందేలు కాశారు. కానీ ఈ స్థాయిలో ఎందుకు పందేలు కాస్తున్నారో ఊహించలేకపోయారు. చివరికి అటు పార్టీ ఓటమితో పాటు పందేలు కూడా కోల్పోవడంతో తీవ్రంగా నష్టపోయారు. 


అయితే కొంత మంది  వైసీపీ నేతలు ఎన్నికల సరళి చూసిన తర్వాత తమ డబ్బులు రికవరీ చేసుకునేందుకు టీడీపీ గెలుస్తుందని పందేలు కట్టారని.. అదే కొంత మందిని కాపాడిందన్న  గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.