మైలవరంలో వసంత పయనం ఎటు?

మైలవరం వైసీపీ రాజకీయం గురించి లేటెస్ట్‌గా చెప్పేదేమి లేకపోయినా అప్‌డేట్స్ కోసం పొలిటికల్ సర్కిల్‌లో సెర్చింగ్ జరుగుతూనే ఉంటుంది.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార పక్షానికి చెందిన శాసన సభ్యులు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. పక్క చూపులకు పరిమితం కాకుండా టిక్కెట్ కోసం అప్పుడే లాబీయింగ్ కూడా మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతుంది.

Continues below advertisement

మైలవరం వైసీపీ రాజకీయం గురించి లేటెస్ట్‌గా చెప్పేదేమి లేకపోయినా అప్‌డేట్స్ కోసం పొలిటికల్ సర్కిల్‌లో సెర్చింగ్ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ కావటంతో కాస్త పోటీ ఎక్కువ ఉండటం కామన్. అయితే ఇక్కడ ఏకంగా ఎమ్మెల్యేకే పొగ పెట్టేసి మంత్రి స్థాయిలో ఉన్న బీసీ వర్గానికి చెందిన వ్యక్తి మైలవరంలో చక్రం తిప్పేయమటం ఇబ్బందిగా మారింది. 

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉండటం, కాస్త పొలైట్‌గా పాలిటిక్స్ ను నడిపిస్తున్నారు. అయితే మంత్రిగా ఉన్న జోగి రమేష్ మాత్రం మైలవరంపైనే మనస్సు పారేసుకున్నారు. దీంతో ఈ వ్యవహరం వసంతకు ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో పార్టీ పెద్దల సపోర్ట్ కూడా వసంతకు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఆయన రెండో ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పక్క పార్టీపై మనస్సు పారేసుకున్నారని లోకల్‌గా టాక్ వినిపిస్తోంది. 

టీడీపిలోకి లైన్ క్లయిర్ అయ్యిందా!

వైసీపీ వ్యవహరాలపై వసంత విసిగిపోయారని సన్నిహితులు అంటున్నారు. అందులో భాగంగానే వసంత టీడీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో మైలవరం టీడీపీలో కూడా అక్కడ ఇంచార్జ్ గా ఉన్న దేవినేని ఉమా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ వీక్ పాయింట్‌ కారణంగానే టీడీపీలోకి వెళ్ళేందుకు  వసంతకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. 

వాస్తవానికి మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నిలబడిన దేవినేని ఉమాను ఓడించటమే టార్గెట్ గా అక్కడ ఉన్న జోగి రమేష్‌ను ఆఖరి నిమిషంలో జగన్ పెడన నియోజకవర్గానికి అప్పగించి, మైలవరంలో వసంతకు సీటు ఇచ్చారు. దీనికి తోడు జగన్ గాలి వీయటంతో మైలవరంలో వసంత విజయం సాధించారు.  గెలిచిన ఏడాది కూడా కాకముందే మైలవరంలో జోగి వ్యవహర శైలి, తన నియోజకవర్గంలో జోక్యంచేసుకోవటం పై వసంత మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. 

వసంత తండ్రి రాజకీయం...

ఇదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్‌ తండ్రి, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్‌ కూడా సమస్యల్లోకి నెట్టాయి. వైసీపీ పాలనలో కమ్మ వారికి ప్రాధాన్యత లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు నాగేశ్వరరావు. ఆ వ్యాఖ్యలతో వసంత ఇరకాటంలో పడాల్సి వచ్చింది. తన తండ్రి వ్యాఖ్యలతో తాను ఏకీభవించటం లేదని అవి ఆయన వ్యక్తిగతమని వసంత వివరణ ఇచ్చినా పార్టీలో మాత్రం ఆ కామెంట్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. వీటికి తోడగా వసంత నాగేశ్వరరావు తాజాగా టీడీపీ ఎంపీ కేశినిని నానితో సమావేశం అయ్యారు. ఇరువురు నేతలు కలసి గంటకుపైగా మాట్లాడుకున్నారు. ఇది కూడా వైసీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. దానిపైనా వసంత క్లారిటి ఇచ్చారు. అయినా అప్పటికే వసంత నాగేశ్వరావు, ఎంపీ నాని భేటీ వ్యవహరం రాజకీయంగా సంచలనం కావటంతో,వసంత ఎంత మెత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది.

లేటెస్ట్‌గా ఎంపీ కేశినని నాని కామెంట్స్...

ఇవన్నీ చాలవటన్నట్లుగా తాజాగా ఎంపీ కేశినేని నాని కూడా వసంతపై నవ్వుతూనే కామెంట్స్ చేశారు. ఇంతకీ వసంత ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీలో ఉన్నారా లేక ఇండిపెండెంట్‌గా ఉన్నారా లేదంటే టీడీపీ నా అని కేశినేని నాని బహిరంగ వేదికపై ప్రశ్నించారు. ఇలా వరుస ఘటనలతో వసంతగా వెంటాడాయి. అటు వైసీపీలో ఇష్టం లేని వాతావరనం, ఇప్పడు టీడీపీలో అనుకూలంగా మారుతున్న పరిస్థితులతో వసంత పయనం ఎలా ఉంటుందనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ విస్త్రతంగా సాగుతోంది.

Continues below advertisement
Sponsored Links by Taboola