CJP Protest Dharmendra Pradhan: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, నిరుద్యోగ యువత పడుతున్న బాధలను అస్త్రంగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్ల మంది ఫాలోవర్లతో ఒక ప్రభంజనంలా దూసుకొచ్చిన డిజిటల్ ప్రచారమే కాక్రోచ్ జనతా పార్టీ . కేవలం కొన్ని రోజుల్లోనే బీజేపీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకుని ఈ మూవ్‌మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, సోషల్ మీడియాలో వచ్చిన ఆ వేగం ఆన్‌లైన్ దాటి ఒక శాశ్వతమైన ప్రజా ఉద్యమంగా  మారలేకపోయింది. సమస్య నిజమే అయినా, లక్షలాది మంది యువత బాధపడుతున్న మాట వాస్తవమే అయినా.. ఈ  బొద్దింకల పార్టీ  జెన్ జీ   ని పూర్తిస్థాయిలో  కనెక్ట్ చేసుకోలేకపోయింది. 

Continues below advertisement

సమస్య నిజం.. కానీ పరిష్కార వేదికపై నమ్మకం లేదు 

భారతదేశంలో నిరుద్యోగం, నీట్ (NEET) వంటి పరీక్షల లీకేజీలు, నియామకాల జాప్యం వంటి సమస్యలతో లక్షలాది మంది జెన్ జీ యువత తీవ్ర నిరాశలో ఉన్నారనేది నగ్న సత్యం. సిజేఐ వ్యాఖ్యలతో వారి ఆత్మగౌరవం దెబ్బతిన్న మాట కూడా నిజమే. అయితే, ఈ కోపాన్ని వెళ్లగక్కడానికి కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్‌లైన్ వేదికగా పనికొచ్చింది తప్ప, తమ భవిష్యత్తును మార్చే ఒక బలమైన రాజకీయ శక్తిగా దాన్ని యువత చూడలేకపోయారు. సమస్యపై ఉన్న శ్రద్ధ, ఆ సమస్యను ఎత్తిచూపిన ఒక వ్యంగ్య   పేజీపై లాంగ్ టర్మ్‌లో నిలవలేదు.

Continues below advertisement

 హైపర్-ఐరానిక్ మీమ్ సంస్కృతి 

జెన్ జీ యువతకు  మీమ్స్  , వ్యంగ్యం అంటే చాలా ఇష్టం. కాక్రోచ్ జనతా పార్టీ తనను తాను  బద్ధకస్తుల, నిరుద్యోగుల గొంతుక అని ప్రకటించుకోవడం, రోజుకు 11 గంటలు ఆన్‌లైన్‌లో ఉండే వారే అర్హులని చెప్పడం ప్రారంభంలో ఒక ఫన్నీ ట్రెండ్‌లా కనెక్ట్ అయింది. కానీ, ఒక రాజకీయ మార్పు రావాలంటే కేవలం రీల్స్ లైక్ చేయడం, ఫాలో కొట్టడం సరిపోదు. జెన్ జీ కి ఈ పార్టీ ఒక సటైర్  గానే నచ్చింది తప్ప, సీరియస్  ఐడియాలజీకి కనెక్ట్ కాలేదు. కాక్రోచ్ కాస్ట్యూమ్స్ వేసుకుని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసినా, అది ఒక ఈవెంట్  లా మిగిలిపోయింది తప్ప విప్లవంగా మారలేదు.

 వ్యవస్థ  పైనే జెన్ జీ కి నమ్మకం పోయింది! 

 కేంద్ర ప్రభుత్వంపై జెన్ జీ కి నమ్మకం ఉందా.. అందుకే కనెక్ట్ కాలేదా అనే కోణాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత యువతకు కేవలం కేంద్ర ప్రభుత్వం పైనే కాదు, దేశంలోని ఏ ఒక్క సంప్రదాయ రాజకీయ పార్టీ పైనా, ఈ మొత్తం వ్యవస్థ  పైనా నమ్మకం సన్నగిల్లింది. ఏ పార్టీ వచ్చినా తమకు ఉద్యోగాలు రావనే ఒక రకమైన రాజకీయ విరక్తి  లో యువత ఉన్నారు. ఒకవేళ కేంద్రంపై నమ్మకం లేకపోతే విపక్షాల వైపో లేదా ఇలాంటి కొత్త మూవ్‌మెంట్ల వైపో వెళ్లాలి. కానీ, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక  ఆమ్ ఆద్మీ పా  మాజీ వ్యూహకర్త ఉన్నాడనే విషయం బయటకు రావడం, ప్రతిపక్షాల మద్దతు ఉండటంతో.. ఇది కూడా ఒక పొలిటికల్ ప్రాపగండాయే అని భావించి జెన్ జీ దీనికి దూరంగా జరిగింది.

 ఆన్‌లైన్ అణచివేత,  నాయకత్వ లోపం 

ఈ ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీని అధికారిక ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయడం, టెక్నికల్ హ్యాకింగ్స్ జరగడం వంటివి డిజిటల్ స్మార్ట్ అయిన జెన్ జీ ని కొంత డిఫెన్స్‌లో పడేశాయి. వీటన్నింటికీ మించి, ఈ ఉద్యమాన్ని నడిపించిన అభిజీత్ దీప్కే అమెరికాలో ఉంటూ దీనిని ఆపరేట్ చేయడం, గ్రౌండ్ లెవెల్‌లో ఒక బలమైన, నమ్మకమైన స్థానిక నాయకత్వం లేకపోవడం అతిపెద్ద మైనస్ అయింది. డిజిటల్ మీడియాలో వచ్చే వేవ్ ఎంత వేగంగా వస్తుందో, అంతే వేగంగా కరిగిపోతుందని ఈ మూవ్‌మెంట్ నిరూపించింది.

 డిజిటల్ ఆగ్రహం.. కానీ పొలిటికల్ ఇంధనం లేదు 

సమగ్రంగా చెప్పాలంటే,  కాక్రోచ్ జనతా పార్టీ  అనేది యువత అంతరంగంలోని అసంతృప్తికి ఒక డిజిటల్ థెరపీలా  ఉపయోగపడింది. లక్షలాది మంది బాధ నిజమే అయినా, కేంద్రంపై నమ్మకం లేకపోవడం,  ఈ సరికొత్త వ్యంగ్య వేదిక తమకు ఉద్యోగాలు ఇవ్వలేదు అనే ప్రాక్టికల్ ఆలోచన రావడం వల్లే జెన్ జీ దీనికి లాంగ్ టర్మ్ కనెక్ట్ కాలేకపోయింది. ఫలితంగా, కోట్ల ఫాలోవర్లు ఉన్నా.. ఇది ఒక విప్లవాత్మక మూవ్‌మెంట్  గా కాకుండా, ఇంటర్నెట్ చరిత్రలో ఒక  వైరల్ అధ్యాయం  గానే నిలిచిపోయింది.