BRS BJP Friendship :     బీజేపీని ఓడించడానికి కలవాల్సింది పార్టీలు కాదని.. ప్రజలని  విపక్షాల సమావేశానికి హాజరవడంపై ఢిల్లీలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించనప్పుడు కేటీఆర్ ప్రకటించారు.  గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు అని కేసీఆర్ బహిరంగసభల్లో  చెప్పినట్లే కేటీఆర్ చెప్పారు.  దేశంలో మూడో  ప్రత్యామ్నాయం అవసరం ఉందని.. ఫెడరల్ ఫ్రంట్ పెడతానని దేశవ్యాప్తంగా తిరిగిన నేత కేసీఆర్. పార్టీలన్నీ కలిసి రాకపోవడంతో బీజేపీకు ప్రత్యామ్నాయంగా మరో వేదిక ఉండాలని తన పార్టీ పేరుతో భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు.  కానీ ఇప్పుడు  బీజేపీపై యుద్ధానికి ఇతర పార్టీలతో కలిసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. పార్టీలు కాదు ప్రజలు కలవాలని అంటున్నారు. 


కేసీఆర్ బీజేపీతో  రాజీ పడిపోయారా ?


ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే..కేసీఆర్ బీజేపీతో రాజీపడిపోయారని ఎక్కువ మంది నమ్ముతారు.  జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా  పార్టీలు వివిధ అంశాలపై పోరాడుతున్నాయి. అందులో  ఢిల్లీ ప్రభుత్వ  అధికారాలను తగ్గించేందుకు కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కూడా ఒకటి. కేజ్రీవాల్ హైదరాబాద్ వచ్చి అడిగితే.. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేసఆర్ వ్యాఖ్యలు చేశారు. కానీ పార్లమెంట్ లో వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించలేదు.  బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఈ విషయంలో ఆ పార్టీలతో కలవకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ తమకు ప్రత్యర్థి కాబట్టి ఆ పార్టీతో కలిసి పని చేయమని ..బీఆర్ఎస్ నేతలు వాదించవచ్చు కానీ.. గతంలో రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.  


కేసీఆర్‌ను విపక్షాల భేటీకి ఆహ్వానించని నేతలు 
 
ఇప్పటికే జాతీయ నేతలు.. ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. గతంలో పట్నా వెళ్లి మరీ కేసీఆర్.. నితీష్ ను కలిశారు. కానీ ఈ సారి మాత్రం నితీష్ ను కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపించడం లేదు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి   కేసీఆర్ కు ఆహ్వానం కూడా అందలేదు. అంతకు ముందు స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలకూ కేసీఆర్‌కు ఆహ్వానం అందలేదు. కేసీఆర్ తరపున జాతీయ రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడంలో కేసీఆర్ కుమార్తె కవిత ముందు ఉంటారు. జాతీయ స్థాయి అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేస్తూ ఉంటారు. పార్టీ స్పందన తెలియచేస్తూ ఉంటారు. ఇప్పుడు  కవిత కూడా మాట్లాడటం లేదు. దీంతో కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడానికి ఏ మాత్రం సిద్ధం లేరన్న అభిప్రాయానికి వస్తున్నారు. 


బీఆర్ఎస్, బీజేపీ మధ్య కనిపించని మైత్రి వల్ల కాంగ్రెస్ కు మేలు 


నిజానికి కేసీఆర్ ఇప్పుడు బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా.. యుద్ధం ప్రకటించకుండా ఉండటం బీజేపతో పాటు బీఆర్ఎస్‌కూ నష్టమే. ఎందుకంటే.. రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత సడలిపోవడంతో రెండు పార్టీలు ఒక్కటేనన్నప్రచారం ఊపందుకుంటోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తోంది. కర్ణాటకలో వచ్చిన గెలుపుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకుంటోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న ప్రచారంతో నేతలంతా పోలోమని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీని వల్ల తెలంగాణలో ముఖాముఖి  పోరు జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరాటం జరుగుతుంది. దీని వల్ల ఎక్కువ నష్టపోయేది..అధికారానికి ముప్పు ఏర్పడేది బీఆర్ఎస్ పార్టీకే. బీజేపీ పై బీఆర్ఎస్ ముద్ర పడితే..  ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కన్సాలిడేట్ అవుతాయి. ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ విజయానికి ఢోకా ఉండదు. కానీ తెలంగాణలో జరుగుతోంది మాత్రం వేరే 





Join Us on Telegram: https://t.me/abpdesamofficial