BJP Vishnu :   ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి త్రివర్ణ పతకాన్ని తిరగేసి పట్టుకున్నారని .. ఆయనకు కనీస అవగాహన కూడా లేదని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది.  ఆజాదికాఅమృత మహోత్సవంలో భాగంగా     మీడియా సమావేశంలో  పతాక వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాటిని ఆవిష్కరించారు. అయితే ఆ సందర్భంలో తిరగేసి పట్టుకున్నారని కొన్ని సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 



పలువురు నెటిజన్లు ఈ అంశంపై విష్ణువర్ధన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్‌ సోషల్ మీడియా ఇంచార్జ్ కూడా ఇదే తరహా విమర్శలు చేయడంతో విష్ణువర్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందో పూర్తి వీడియో చూడాలని వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో విష్ణువర్ధన్ రెడ్డి సహా అందరూ జాతీయ పతాకాన్ని సవ్యంగానే పట్టుకున్న దృశ్యాలున్నాయి. 



జాతీయ పతాకం విషయంలో ఎవరైనా రాజకీయ నాయకులు త్రివర్ణ పతాకాన్ని సరిగ్గా పట్టుకునేందుకు తిరగేసే క్రమంలో అయినా ఓ ఫోటో దొరికినా.. కొన్ని సెకన్ల వీడియో దొరికినా వారిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేతలు అలా దొరికితే ఇతర పార్టీల నేతలు వదిలి పెట్టారు. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి నెటిజన్లకు అలాగే దొరికారు. 



మీడియా సమావేశంలో జాతీయ జెండాను తిరగేసి పట్టుకున్న వెంటనే విష్ణువర్ధన్ రెడ్డితో  పాటు ఇతరులు గుర్తించారు. కొన్ని సెకన్ల వ్యవధిలోనే అందరూ తిరిగి మళ్లీ సవ్యంగా పట్టుకున్నారు. అయితే ఈ లోపే వీడియో వైరల్ అయిపోయింది.  


అయితే సహజంగా ఇలాంటివి వైరల్ అయిన తర్వాత వివరణ ఇచ్చినా వాటి గురించిపెద్దగా పట్టించుకోరు. ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు విష్ణువర్దన్ రెడ్డిది కూడా అదే పరిస్థితి.