Vijay Trisha Controversy TN Politics:  తమిళనాడు రాజకీయం మొదటి నుంచీ సినిమా, గ్లామర్,  నేతల వ్యక్తిగత జీవితాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.   ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిల హయాం నుంచి మొదలైన ఈ సంస్కృతిలో, ప్రజా నాయకుడి  వ్యక్తిగత ఇమేజ్  అనేది రాజకీయ నైతిక బలానికి అత్యంత కీలకమైన పునాదిగా భావిస్తారు. అయితే,  తమిళగ వెట్రి కళగం  పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన విజయ్ విషయంలోనూ ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వేదికలపై రచ్చ రేపుతోంది. ముఖ్యంగా నటి త్రిషతో విజయ్‌కు ఉన్న సాన్నిహిత్యం, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులకు లభిస్తున్న అనధికారిక ప్రాధాన్యతపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

Continues below advertisement

త్రిషనే హైలెట్ చేస్తున్న విపక్షాలు

ఇటీవల అన్నాడీఎంకే  నేత ఆర్‌.బి. ఉదయకుమార్ ,  డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌లు త్రిష పేరును ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. తమ సినిమా వర్గానికి చెందిన నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వ, పార్టీ పదవులు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ, త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎం చేస్తారు?  అంటూ ఉదయకుమార్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కేసులు నమోదై ఆయన అరెస్ట్ అయ్యేంత వరకు వ్యవహారం వెళ్లింది. అయినప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని, త్రిషకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రధాన రాజకీయ ఆయుధంగా మలుచుకోవడానికి వెనకాడటం లేదు. తమిళనాడులో మహిళా ఓటర్లు దశాబ్దాలుగా అత్యంత కీలకమైన నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అన్నాడీఎంకేకు జయలలిత హయాంలో మహిళల నుంచి అపారమైన ఆదరణ దక్కడానికి కారణం ఆమె అందించిన క్లీన్ ఇమేజ్ మరియు సంప్రదాయ విలువల పట్ల చూపిన గౌరవం. ప్రస్తుతం విజయ్ తన కుటుంబ, వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలు,  త్రిషతో ముడిపడి ఉన్న వివాదాలపై మౌనంగా ఉండటం సంప్రదాయ ఆలోచనలు కలిగిన గృహిణులు, గ్రామీణ మహిళా ఓటర్లలో కొంత ప్రతికూల భావనను కలిగించే ప్రమాదం ఉంది. ప్రజా జీవితంలో ఉన్న నేత తన ప్రవర్తన ద్వారా ఇటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండటమే సురక్షితమైన మార్గమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

జెన్ జీ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోదా? 

మరోవైపు, విజయ్ అనుసరిస్తున్న ఈ వైఖరిని  న్యూ ఏజ్ పొలిటికల్ పర్సనా గా చూసే వర్గం కూడా ఉంది. విమర్శలకు భయపడకుండా, తన వ్యక్తిగత సంబంధాలను దాచకుండా బోల్డ్‌గా వ్యవహరించడం ద్వారా Gen-Z, ఆధునిక భావాలు కలిగిన యువతను ఆకట్టుకోవచ్చని విజయ్ వ్యూహకర్తలు భావిస్తూ ఉండవచ్చు. "నా వ్యక్తిగత జీవితం కంటే నా పరిపాలన, సంక్షేమ విధానాలే ముఖ్యం  అనే సందేశాన్ని ఆయన పరోక్షంగా పంపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పాతతరం రాజకీయ చట్రంలో నడిచే తమిళనాడు వంటి రాష్ట్రంలో ఈ  బోల్డ్ పొలిటికల్ ఇమేజ్ ' ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ప్రశ్నార్థకమే.

త్రిష టాపిక్‌లో  టీవీకే క్యాడర్‌కు సమస్యే

ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం పరంగా చూస్తే, ఇటువంటి వ్యక్తిగత వివాదాలు TVK క్యాడర్‌ను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేస్తున్నాయి. సోషల్ మీడియాలో డీఎంకే, అన్నాడీఎంకేల ట్రోలింగ్‌ను తిప్పికొట్టలేక, సిద్ధాంతపరమైన అంశాల కంటే వ్యక్తిగత విషయాలపైనే డిఫెన్స్‌లో పడాల్సి రావడం పార్టీకి మైలేజ్ తగ్గించే అంశం. అధికారిక  కార్యక్రమాల్లో ఒక నిర్దిష్ట పరిమితిని పాటించకపోతే, ప్రత్యర్థులు నిరంతరం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వ పరిపాలనా లోపాలను కప్పిపుచ్చేందుకు వాడుకుంటారు. తమిళ రాజకీయాల్లో సీఎంగా అధికారం చేపట్టినంత మాత్రాన వివాదాలు సమసిపోవు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ఈ గ్లామర్ వివాదాన్ని  అధిగమించాలంటే, ప్రజా సమస్యలపై పట్టు సాధించడమే కాకుండా, తన వ్యక్తిగత ప్రవర్తనలోనూ ప్రజలకు నమ్మకం కలిగించే స్పష్టతను ప్రదర్శించాలి. లేని పక్షంలో, ప్రత్యర్థులు సంధిస్తున్న ఈ నైతిక దాడి  ఆయన పొలిటికల్ కేరీర్‌కు, ప్రభుత్వ ఇమేజ్‌కు దీర్ఘకాలంలో తీవ్ర విఘాతం కలిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తమిళ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.