TRS Dilemma : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ఎవరికో ఇంకా స్పష్చటత రాలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణలో ద్రౌపది ముర్ముకు కేవలం బీజేపీకి ఉన్న మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగతావన్నీ ప్రతిపక్ష పార్టీ తరపు అభ్యర్థి సిన్హాకే లభించాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి తెలంగాణ కీలకం. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై టీఆర్ఎస్ నోరు మెదపడం లేదు. ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్ ఖడ్ నామినేషన్ వేశారు. ఇక విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా బరిలోకి దిగారు.
దేశానికి కోటిన్నర కోట్ల అప్పు ! రాష్ట్రాలకు సుద్దులు చెప్పి కేంద్రం చేస్తున్నదేంటి ?
బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన జగదీప్ ధన్ ఖడ్.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. పలు సందర్బాల్లో ధన్‌ఖడ్ తీరును కేసీఆర్ కూడా తప్పు పట్టారు. అయితే అనూహ్యంగా విపక్షాల కూటమి అభ్యర్థికి తాము మద్దతిచ్చేది లేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో విపక్షాల అభ్యర్థి మార్గరేట్ అల్వాకు మొదటి షాక్ తగిలినట్లయింది. కేసీఆర్ కూడా ఇంత వరకూ సిన్హాకు ఇచ్చినట్లే విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామని ఇంత వరకూ ప్రకటించలేదు. ఆలాగనే ఎెన్డీఏ అభ్యర్థికీ మద్దతు తెలియచేయలేదు.
మునుగోడులో అప్పుడే ఉపఎన్నిక ఫీవర్ - రంగంలోకి దిగిన పార్టీలు !మునుగోడులో అప్పుడే ఉపఎన్నిక ఫీవర్ - రంగంలోకి దిగిన పార్టీలు !
ఉపరాష్ట్రపతి విషయంలో విపక్షాల అభ్యర్థిగా మార్గరేట‌్ అల్వాను చర్చలు లేకుండానే ప్రకటించేశారు. ఈ కారణంగా మమతా బెనర్జీ మద్దతు ప్రకటించలేమని పేర్కొంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో టీఆర్ఎస్ దూరంగా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు అవుతుందని కారణం చెప్పే అవకాశం ఉందంటున్నారు. మద్దతు ఇస్తే కాంగ్రెస్‌తో దోస్తానా కట్టినట్లు చర్చలు జరుగుతాయి. దూరంగా ఉంటే స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోయిందనే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందుకే వీలైనంతగా నాన్చి చివరి క్షణంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
పోలింగ్ జరిగే నాటికి ఉపరాష్ట్రపతికి ఎన్నికలకు తాము గైర్హాజర్ అవుతామనే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‍సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే. ప్రస్తుతం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఈ అంశంపై విపక్ష నేతలతో ఏమైనా చర్చలు జరిపితే.. ఈ పర్యటనలోనే ఏదో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.