హైదరాబాదులోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అవమానకరంగా చిత్రీకరించారంటూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.  అక్కడున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. వీరిని అదుపు చేసేందుకు గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా వివరించారు. అనంతరం గాంధీ భవన్ గేట్లకు భారీ కేడ్లు వేసి పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ వద్ద కొంత వాతావరణం నెలకొంది. 


కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు చెప్పురా దండ వేసి దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఈ ప్రదర్శన చేయడానికి గాంధీభవన్ నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను ఎక్కి మరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. 


కాంగ్రెస్ నాయకుల అరెస్టు...


బెంగళూరు-మైసూరు హైవేపై టోల్ వసూలుకు వ్యతిరేకంగా శేషగిరిహళ్లి టోల్ గేట్ దగ్గర కాంగ్రెస్ నిరసన చేపట్టింది. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైవేపై బైఠాయించిన కాంగ్రెస్‌ ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బిజెపి చేస్తున్న నీచ రాజకీయాలు మరియు పోస్టర్ ప్రచారానికి వ్యతిరేకంగా కేరళలోని వివిధ జిల్లాల్లో బిజెపి కార్యాలయాలకు నిరసన ప్రదర్శన నిర్వహించింది. వివిధ జిల్లాల్లో వేలాది మంది కార్మికులు నిరసనలో పాల్గొన్నారు.


గాంధీభవన వద్ద పరిస్థితులు సందర్భంగా పలువు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీభవన్ వద్దకు భారీగా పార్టీ శ్రేణులు చేరుకోవడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. గాంధీభవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించి చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.


పోలీసులను కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ లోని ముఖ్య నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమను అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ఉందని పోలీసులకు వెల్లడించారు. 


కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని ప్రధాని మోదీ అవమానించారంటూ హైదరాబాదులోని గాంధీభవన్ వద్ద నిరసనలు మొదలయ్యాయి. రాహుల్ గాంధీని అవమానించే హక్కు ప్రధానికి లేదని కాంగ్రెస్ నాయకుడు వెల్లడించారు. ప్రధాని మోదీ వల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బేషరతుగా రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 


లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి ఇందిరాపార్క్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా పోలీసులు వారిని నిలువరించారు. నిరసనలకు ఇలాంటి అనుమతి లేదని వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. 


భారత్ జోడో యాత్రతో వస్తున్న ప్రజ ఆదరణ చూడలేక పాత కేసును సాకుగా చూపి రాహుల్ గాంధీ లోక్ సభ సభత్వని రద్దు చేసి ఆయన  అస్తిత్వాన్ని కించ పరచడానికి  మోడీ అనేక ప్రయ్త్నాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ విధంగా రాహుల్ గాంధీని అవమానపరిచేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను హరించడమే ఇలాంటి కక్ష సాధింపు చర్యలను మోడీ ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన సమాధానం ప్రజలు ఇస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.