Telangana Elections 2023 :   ఒక్క స్లోగన్ రాజకీయాన్ని మార్చేస్తుంది.  ఒక్క పిలుపు అందర్ీనీ ఆకట్టుకుటుంది. రాజకీయ పార్టీలకు ఎన్నికలసమయంలో ఇది చాలా ముఖ్యం కూడా.  అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీలు, వాటి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన వీడియోలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ ( Congress  ) వర్గాలు చెబుతున్నాయి.  కేసీఆర్ హామీలు ఇచ్చి నెరవేర్చలేదని..  వాటిని ప్రజలు ఎత్తిచూపుుతున్నారని వీడియోలలో చూపించారు.  సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీలు  తప్పుడవని చెప్పేలా   వినూత్న రీతిలో ఈ వీడియోలు రూపొందించామని కాంగ్రెస్ ప్రకటించుకుంది.   





 


కేసీఆర్ తప్పుడు మాటలను ప్రజలు నమ్మడం లేదని, ఈ సారి కారు పంక్షర్ అవడం ఖాయమని..  మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి  అని ప్రజలు కోరుకుంటున్నట్లు రూపొందించిన ఈ వీడియోలు అందరినీ ఆకర్షిస్తున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వీడియోలో ప్రజలారా నమస్తే బీఆర్ఎస్ కు ఓటేస్తే మా హామీలు పక్కా అంటూ కేసీఆర్ పాత్రధారి చెప్పగా, ప్రజల వైపు నుంచి పేపర్లు లీక్ చేశారని, నిరుద్యోగ భృతి అని నిండా ముంచారని, ధరణీ పేరుతో భూములు లాక్కున్నారని, రుణమాఫీ, ఉచిత ఎరువులు అని రైతుల నోట్లో మన్ను కొట్టిండని, డబుల్ బెడ్ రూంలు కట్టియ్యలేదని, కాళేశ్వరం పేరుతో కోట్లు దోచుకున్నారని, ఎందుకేయాలి మీకు ఓటు చల్ నడవండంటూ ప్రజలు తరమేస్తున్నట్లుగా, కారు పంఛర్ అయినట్లుగా వీడియోలో చూపారు. చివరలో పదేండ్ల అహంకారం పోవాలంటే, పదేండ్ల అవినీతిని తరమాలంటే మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ముగిస్తుంది. వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.  





 


మరో వీడియోలో కేసీఆర్ ( KCR ) నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలను పోలిన విధంగా సెటప్ చేసింది. కాళేశ్వరం, ధరణి పోర్టల్, ఇంటింటికీ నల్లా, ఉద్యోగాలు.. వంటి అంశాలను ఇందులో ప్రస్తావించింది. కేసీఆర్ డూప్ ప్రసంగిస్తోండగా.. వాటికి పక్క నుంచి కౌంటర్లు ఇస్తోండటం ఈ క్యాంపెయిన్ ప్రత్యేకత. ఇదివరకు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రచారాలను చేపట్టింది. అది సక్సెస్ అయింది. దీనితో అదే ఫార్ములాను ఇక్కడా అనుసరిస్తోంది కాంగ్రెస్. ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు- ఈ ఐడియా వెనుక ఉన్నారు. ఆయనే ఈ తరహా సెటైరికల్ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారని, దీనికి మంచి స్పందన వస్తోందని, గ్రామగ్రామాన దీన్ని ప్రదర్శిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.