తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రెడీ అవుతున్నాయి. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించేసింది. టికెట్ దక్కని నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దించింది. టికెట్ దక్కని నేతలకు నామినేటేడ్ పోస్టుల్లో పెద్దపీట వేస్తామని హామీలు ఇస్తోంది. పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచిస్తోంది. కొందరు నేతలు బుజ్జగింపులతో మెత్తబడినా మరికొందరు అలకవీడటం లేదు. 


టికెట్ దక్కిన బీఆర్ఎస్ నేతలు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారని ఆరా తీస్తున్నారు. వారి సామాజిక వర్గాలు ఏంటి ?ఎన్ని కోట్లు ఖర్చు చేయగలరు ? బలహీనతలు, బలాలను తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారి వివరాలు తెప్పించుకుంటున్నారు.  సన్నిహితులు, పార్టీ నేతల ద్వారా ప్రత్యర్థుల బ్యాక్ గ్రౌండ్ కనుక్కుంటున్నారు. వారి సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఏ ఏ గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయి ? అన్న అంశాలపై దృష్టి సారించారు. 


కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పార్టీ తరపున పోటీ చేసే వారిని ప్రకటించకపోయినా బీఆర్ఎస్ మాత్రం ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.  కీడెంచి మేలు ఎంచాలన్న టార్గెట్ తో పని చేస్తున్నారు. గులాబీ బాస్ ఎన్నో ఆశలతో టికెట్ కేటాయించారని గెలిచి తీరాలన్న వ్యూహాలతో నేతలు ప్రచారం షూరూ చేసేశారు.  కాంగ్రెస్ క్యాండేట్ ను ఎలా ఇరుకున పెట్టాలి. బీజేపీని ఎలా దారిలోకి తెచ్చుకోవాలన్న అంశాలతో ఎజెండాను రెడీ చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలోకి రాకముందే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు మొదలు పెట్టేశారు. గ్రామాల వారీగా పార్టీ నేతలను పిలిపించుకొని ప్రత్యర్థి ఓట్ల శాతాన్ని తెలుసుకుంటున్నారు. 


ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే ఏం చేయాలి. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు  వచ్చిన ఓట్లు ఎన్ని వంటి వివరాలను బీఆర్ఎస్ క్యాండేట్లు సేకరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఫిక్సయిన తర్వాత దూకుడుగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఓటర్లకు ఇప్పటి నుంచే తాయిలాలు ప్రకటించేస్తున్నారు.  కుల సంఘాలు,ఉద్యోగ సంఘాలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు.   బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న గ్రామాలపై నేతలు కాన్సట్రేట్ చేశారు. ప్రత్యర్థి పార్టీల సెకండ్ క్యాడర్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఏం కావాలో అన్ని చేసేస్తామని హామీలు ఇస్తున్నారు. నగదుతో పాటు కావాల్సిన పనులు చేసి పెడుతున్నారు. ఫ్యూచర్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు