TDP MP Candidates - అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) నాలుగో విడత అభ్యర్థుల ప్రకటనతో అనంతపురం (Anantapur) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం అర్బన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదని, బిజినెస్ మ్యాన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడంతో అనంతపురం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు భారీగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు చేరుకుని పెద్ద ఎత్తున చంద్రబాబుని, నారా లోకేష్ (Nara Lokesh) ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోవైపు నగరంలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంపై కూడా దాడి చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడిలో కార్యాలయం గేట్లు బండరాలతో పగలగొట్టి లోపల ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను ఫర్నిచర్ ను కార్యాలయం ఎదురుగా వేసి నిప్పట్టించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ సీఎం చంద్రబాబు ఉన్న పార్టీ కార్యాలయం హోర్డింగ్ ను సైతం అదే మంటలలో వేసి తగలబెట్టారు. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకొని నిరసనను వ్యక్తం చేశారు. 

Continues below advertisement

స్థానికులకు కష్టపడిన వారికి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో కేసులు పెట్టించుకుని ధైర్యంగా నిలబడిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా కేటాయిస్తారని వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కార్యకర్తలపై తమపై ఎన్నో కేసులు బనాయించిన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు. రేపటి రోజున తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణలను ప్రకటిస్తానని వెల్లడించారు.

గుంతకల్లు నియోజకవర్గంలోనూ పరిస్థితి గుంతకల్లు నియోజకవర్గంలోనూ పార్టీ ఇంచార్జ్ జితేంద్ర గౌడ్ కి కాదని వైసీపీ నుంచి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం కు టిడిపి అధినేత టికెట్ను ప్రకటించారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గం లో ఒకసారి గా తెలుగుదేశం పార్టీ వర్గీయులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ముంతకల్లు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. గతంలో నారా చంద్రబాబు నాయుడుని లోకేష్ ను ఇష్టం వచ్చినట్లుగా దూషించిన వ్యక్తికి పార్టీలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించడం ఏంటని ప్రశ్నించారు.

Continues below advertisement

చీపురుపల్లిలో భగ్గుమన్న టీడీపీ శ్రేణులువిజయనగరం జిల్లా చీపురుపల్లిలో తెలుగుదేశం పార్టీ పదవులకు కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. నాగార్జున వెంటే మేము అంటూ నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు,నాయకులు రాజీనామాలు చేస్తామంటున్నారు. నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కరపత్రాలను, జెండాలను తగలబెట్టారు తెలుగుతమ్ముళ్లు. కళా వద్దు నాగార్జునే ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎచ్చెర్ల వదిలేసి చీపురుపల్లి వచ్చావంటూ కళా వెంకట్రావ్ పై నాగార్జున ఫైర్ అయ్యారు.