Tenali Politics : ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశం కొలిక్కి వస్తోంది. అంతర్గతంగా టీడీపీ,జనసేన నేతలు ఖచ్చితంగా ఓకే అనుకున్న సీట్ల విషయంలో రాజీ పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  ఇప్పటికే పొత్తుల వ్యవహరంలో టీడీపీ, జనసేన నేతల మధ్య అవగాహన వచ్చిందని అంటున్నారు. పొత్తుల అంశం పై ఇరు పార్టీల నేతలు మాత్రం క్లారిటి లేదని చెప్పుకొస్తున్నారు. కానీ జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకలాపాలను తగ్గించుకుంటూడటంతో  అంతా వ్యూహాత్మకంగా జరుగుతోందని అంటున్నారు. తెనాలి నియోజకవర్గ రాజకీయం మాత్రం ఇప్పటి నుండి సెటిల్ అయ్యిందని అంటున్నారు. 


తెనాలి సీటును నాకేమైనా రాసిచ్చారా అంటూ ఆలపాటి వ్యాఖ్యలు


తెనాలిలో 2014లో టీడీపీ నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్  విజయం సాదించారు. అంతకు ముందు 2004, 2009 సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ  అభ్యర్దిగా నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో వైసీపీ గాలి వీయటంతో అన్నాబత్తుని శివకుమార్ తెనాలి సీటును దక్కించుకున్నారు. అప్పటి వరకు సీనియర్ నేతల చేతిలో ఉన్న తెనాలి నియోజకవర్గం కొత్తగా పోటీ చేసిన అభ్యర్ది అన్నాబత్తుని శివకుమార్ చేతిలోకి వెళ్ళింది. దీంతో ఈ సారి జరిగే ఎన్నికల్లో తెనాలి సీటును ఎలాగయినా దక్కించుకోవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.  అయితే అనూహ్యంగా తెనాలి నియోజకవర్గం పై టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న ఆలపాటి రాజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెనాలి సీటు నాకేమయినా రాసిచ్చారా అంటూ ఆయన అన్న మాటలు చర్చకు దారితీస్తున్నాయి.


పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడం ఖాయమేనా ? 


తెనాలిలో సీనియర్ టీడీపీ నేతగా ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , ఊహించని విదంగా ఇలా మాట్లడటం వెనుక పొత్తుల అంశమే కీలకమని అంటున్నారు. వాస్తవానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. ఉన్నది ఉన్నట్లుగా ఆయన కుండబద్దలు కొట్టేస్తారు. దీంతో ఆయన వ్యాఖ్యలు పై చాలా మంది నొచ్చుకున్నా, తరువాత ఆయన మాట్లలో ఉన్న సీరియస్ నెస్ ను గుర్తించి తరువాత ఆయనకు ఒకే చెప్పటం పరిపాటి.  ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వెనుక జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారని చెబుతున్నారు. జనసేన పార్టీతో పొత్తుల అంశం పై టీడీపీలో చర్చ జరుగుతున్నందున తెనాలి సీటు కోసం నాదెండ్ల రెడీ గా ఉన్నారు.  ఆయన తెనాలి నుండి పోటీ చేయాలంటే, పొత్తులో భాగంగా, టీడీపీ ఆ సీటును వదలుకోవాల్సిందే. సో ...ఈ విషయంలో దాచేది ఎముంటుంది అన్న ఉద్దేశంతోనే ఆలపాటి అలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. 


తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేసే చాన్స్ !


రాజకీయంగా ఇప్పటికే జనసేన, టీడీపీ కలసి పోటీ చేయటం పై ఇరు పార్టీలకు చెందిన నేతలు అండర్ స్టాండింగ్ కు వస్తున్నారని చెబుతున్నారు. దీంతో జనసేనలో పవన్ తరువాత నెంబర్ టూలో ఉన్న నాదెండ్ల మనోహర్  పోటీ చేసేందుకు తెనాలి మాత్రమే ఆప్షన్.  దీంతో ఇప్పటి నుండి టీడీపీ శ్రేణులకు ఈ విషయం పై క్లారిటి ఉంటే ఎన్నికల నాటికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఆలపాటి అభిప్రాయంగా చెబుతున్నారు.  తెనాలి నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ మరో సారి బరిలోకి దిగుతారన్నది వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగానే తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ రెండు సార్లు విజయం సాదించి, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా కూడా పని చేశారు.  తరవాత పవన్ స్దాపించిన జనసేనలో నాదెండ్ల నెంబర్ టూ గా చక్రం తిప్పుతున్నారు.