TDP has announced that they will reveal a big thing at 12 noon on Thursday : తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఓ పెద్ద విషయాన్ని బయట పెట్టబోతున్నామని ప్రకటించారు. ఏదైనా పరిశ్రమ లేదా ప్రాజెక్టు గురించి ప్రకటన అయితే పార్టీ పరంగా ప్రకటన చేయరు. కానీ రాజకీయ  పరమైన ప్రకటన అదీ కూడా.. బిగ్ ఎక్స్‌పోజ్ అని ప్రకటించారు. అంటే ఖచ్చితంగా వైసీపీ హయాంలో భారీ అవినీతిని లేదా.. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదైనా ఎవరికీ తెలియని విషయాన్ని ప్రకటించబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. 






లోకేష్‌ను ఇక పదే పదే గుర్తుకు తెచ్చుకోవాలన్న  టీడీపీ


ఈ ట్వీట్ చేసిన తర్వాత తెలుగుదేశంపార్టీ ఏదో ప్రకటించబోతోందని అందరికీ అర్థం అయిపోయింది. అదేమిటి అన్నది టీడీపీ ముఖ్య నేతలకూ తెలియదు.  అందరూ స్టే ట్యూన్డ్ అంటున్నారు కానీ అసలు ఆ టాపిక్ ఎమిటో చెప్పడం లేదు. అయితే టీడీపీ ట్విట్టర్ హ్యాండిలే కొన్ని క్లూలతో కూడిన టీజర్లు రెడీ చేస్తోంది. ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తోంది. ఇటీవల ఢిల్లీ ధర్నాలో  జగన్ జాతీయ మీడియాతో మాట్లాడినప్పుడు లోకేష్ రెడ్ బుక్ గురించే మాట్లాడారు. ఆ వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ .. ఇక ముందు నారా లోకేష్  పేరును కలవరించాల్సిందేనని జగన్‌కు సంకేతాలు పంపారు. 



వైసీపీ అక్రమాలపై ఓ పెద్ద  విషయం బయట పెట్టబోతున్నారా ? 


ఈ రెండు ట్వీట్లను బట్టి చూస్తే ఖచ్చితంగా రాజకీయ పరమైన.. అదీ కూడా వైసీపీకి , ఆ పార్టీ అధినేత జగన్ కు ఇబ్బందికరంగా మారే విషయం బయట పెట్టబోతున్నారని ఊహించుకోవచ్చు. జగన్ మోహన్ రెడ్డి గురించి బయట పెట్టాలనుకుంటే సంచలన విషయాలు ఉంటాయని టీడీపీ నేతలు అంటున్నారు. గత ప్రభుత్వంలో జీవోలన్నీ రహస్యంగా ఉంచారు. ఇప్పుడు అన్నీ వెలుగులోకి తెస్తున్నారు. ఆ జీవోల్లో ఏమైనా సంచలనాత్మక విషాయాలు ఉంటే వాటిని బయటపెడతారా లేకపోతే.. జగన్ కొత్తగా ఏమైనా కంపెనీలు పెట్టి ఉంటే వారిని  బయట పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.                         


కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నలాగా పొలిటికల్ సర్కిల్స్‌లో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ టీడీపీ ఏమి ప్రకటించబోతోదో.. జగన్ ఎందుకు లోకేష్ పేరును కలవరించారో అన్న ఉత్కంఠ మాత్రం  కొనసాగించనునన్నారు.