Tdp Ex Mla Sugunamma Worry on Tirupati Assembly Seat: ఎన్నికల వేళ పార్టీల నుంచి టికెట్ ఆశించిన నేతలు అవి దక్కకపోవడంతో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (Sugunamma) అభ్యంతరం తెలిపారు. అధిష్టానం దీనిపై పునరాలోచించాలని కోరారు. ఈ స్థానాన్ని జనసేన తరఫున ఆరణి శ్రీనివాసులుకు కేటాయించారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు.. ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. టిక్కెట్ ను సుగుణమ్మకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.  


కన్నీళ్లు పెట్టుకున్న సుగుణమ్మ



టీడీపీ (Tdp) కోసం అహర్నిశలు పని చేశామని.. ఇప్పుడు తిరుపతి టికెట్ దక్కకపోవడం బాధాకరమని సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 'చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయి.?. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. పార్టీ కేడర్ అంగీకరించడం లేదు. టీడీపీ, జనసేన అధ్యక్షులు తిరుపతి అసెంబ్లీ స్థానంపై పునరాలోచించాలి. అధికార వైసీపీతో అనునిత్యం పోరాటం చేశాం. కానీ, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారికే టికెట్ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదు. నాకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి అసెంబ్లీ స్థానంపై పునరాలోచిస్తారని నమ్ముతున్నా.' అని సుగుణమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబం చేసిన పనులన్నీ ఆమె గుర్తు చేసుకున్నారు.


Also Read: Raghurama Krishnaraju: బీజేపీ నేతతో కలిసి నాకు సీటు రాకుండా జగన్ అడ్డుకున్నారు: రఘురామ సంచలన ఆరోపణలు