TDP Will Join Modi Cabinet: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో(Lok Sabha Election Result 2024)... బీజేపీ (BJP)కి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 240 సీట్లను మాత్రమే సాధించింది కమలం పార్టీ. అయితే.. ఎన్డీయే (NDA) కూటమి మాత్రం మ్యాజిక్‌  ఫిగర్‌ను దాటి.. 293 స్థానాలు సాధించింది.  దీంతో... కేంద్రంలో NDA మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. సంకీర్ణ ప్రభుత్వంలో... చంద్రబాబు, నితీష్‌కుమార్‌ కీలకంగా మారారు. టీడీపీకి 16 ఎంపీలు, జేడీయూకి 12  ఎంపీలు వచ్చాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు... టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ (Nitish kumar) మద్దతు తప్పనిసరైంది. దీంతో... వీరికి కేంద్ర కేబినెట్‌ (Union Cabinet)లోనూ  ప్రాధాన్యత దక్కనుంది. రెండు ఎంపీ స్థానాలు ఉన్న జనసేన పార్టీకి కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు.


కేంద్ర కేబినెట్‌ కూర్పుపై ఢిల్లీ (Delhi)లో తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈనెల 9న సాయంత్రం 6గంటలకు మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ(ModiI) ప్రమాణస్వీకారం చేస్తారు. మోడీతోపాటు NDA మిత్రపక్షాలకు చెందిన కొంతమంది నేతలు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేస్తారు. కేంద్ర కేబినెట్‌లో టీడీపీ చేరుతుందని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు. అయితే... మంత్రి పదవుల కేటాయింపును మాత్రం... ప్రధాని నిర్ణయానికే వదిలేయనున్నట్టు తెలుస్తోంది. కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ  శాఖ, విదేశాంగ శాఖ, రోడ్లు, రైల్వే శాఖలను బీజేపీ దగ్గరే ఉంచుకోనుంది. మిగిలిన వాటిలో ముఖ్యమైన మంత్రిపదవులను... టీడీపీ ఎంపీలకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అవి ఏమి అనేది... ఇవాళ జరిగే... NDA భాగస్వామ్య పక్షాల సమావేశంలో  చర్చించనున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. టీడీపీకి కేంద్ర కేబినెట్‌లో నాలుగు మంత్రి పదవులు ఇస్తారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నారు. రెండు కేంద్ర మంత్రి పదవులు... మరో రెండు సహాయ మంత్రిపదవులు ఇవ్వనున్నట్టు  సమాచారం. పౌరవిమానయాన శాఖ, ఉక్కు శాఖను టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 


సామాజిక సమీకణాల ప్రకారం
టీడీపీ నుంచి గెలిచిన ఎంపీలు... బీసీ వర్గాలకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయనకు కేంద్ర కేబినెట్‌లో మంత్రిపదవి ఇచ్చే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక.. ఎస్సీ వర్గం నుంచి ముగ్గురు ఎంపీలుగా గెలిచారు. ఈ ముగ్గురూ మొదటిసారి ఎన్నికైన వారే. వీరిలో చిత్తూరు ఎంపీ ప్రసాద్‌రావు (Prasad Rao) రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఈయనకు... కేంద్ర కేబినెట్‌లో పదవి దక్కే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. ఇక... గుంటూరు, నరసరావుపేట నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar)‌, లావు శ్రీకృష్ణదేవరాయులు(Lavu Sri Krishna Devarayalu) నుంచి ఒకరు.... నెల్లూరు, నంద్యాల నుంచి  గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakar Reddy), బైరెడ్డి శబరి(Byreddy Shabari)లో ఒకరిని కేంద్ర కేబినెట్‌కు పంపే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.
 
జనసేనకు కూడా కేంద్ర కేబినెట్‌లో చోటు
జనసేన (Janasena) నుంచి పోటీచేసిన ఇద్దరు ఎంపీలు గెలిచారు. వీరిలో ఒకరికి కేంద్ర కేబినెట్‌లో చోటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే... జనసేన ఇద్దరు ఎంపీల్లో సీనియర్‌ నాయకుడు, మూడోసారి గెలిచిన బాలశౌరి(Balasouri)కే ఆ  అవకాశం దక్కొచ్చని సమాచారం. ఇక ఏపీ బీజేపీ నుంచి కూడా ముగ్గురు ఎంపీలు గెలిచారు. వీరిలో పురందేశ్వరి(Purandeswari), సీఎం రమేష్‌(CM Ramesh) పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు  ఉన్నాయి.