Jaggareddy Vs Sharmila :  వైఎస్ఆర్ మరణం తర్వాత తాము బాధపడలేదని.. పదవుల పంపకం కోసం చర్చిస్తున్నామన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తప్పు పట్టారు. తన తండ్రి చనిపోయిన సమయంలో తాము బాధపడకుండా రాజకీయాలు చేశామని కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలన్ని అవాస్తమని షర్మిల మండిపడ్డారు. ఆ సమయంలో చెట్టంత మనిషిని కోల్పోయిన తాము బ్రతుకు తామో చస్తామో అన్నంతగా బాధపడిన విషయం జగ్గారెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. జగ్గారెడ్డి మాట్లాడేవన్ని పచ్చి అబద్దాలన్నారు . అసలు జగ్గారెడ్డి ఎవరని ఆమె ప్రశ్నించారు. 


తాను పులిబిడ్డనని జగ్గారెడ్డికి భయపడబోనన్న షర్మిల


ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఇంకోసారి మాట్లాడితే బాగోదని బెదిరించారని..   ఆయన కు భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ అని షర్మిల స్పష్టం చేశారు.  అసలు ఛాలెంజ్ చేయడానికి జగ్గారెడ్డి ఎవరు?. పాలమూరు ఎమ్మెల్యేలు అంతా నాపై స్పీకర్‎కి ఫిర్యాదు చేస్తేనే భయపడలేదు. మంత్రి  కేసు పెడితే  భయపడలేదు. ఈ రాజశేఖర్ బిడ్డ.. ఎవడికి భయపడేది కాదు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని సంకెళ్లు చూపించి సవాల్ విసిరానన్నారు.  ఇక్కడ ఉన్నది వైఎస్సార్ రక్తం.. పులి బిడ్డ. ఇక్కడున్నది వైఎస్సార్ ఊపిరి..వైఎస్సార్ ప్రాణం అని షర్మిల భావోద్వేగంతో స్పందించారు. 


తనపై విమర్శలు చేయడంతో జగ్గారెడ్డి ఘాటు కౌంటర్ 


సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో పాదయాత్ర చేస్తున్న షర్మిల  సంగారెడ్డి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డిపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కోవర్ట్ అని మండిపడ్డారు. షర్మిల అలా విమర్శించడంతో రెండు రోజులుగా జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విమర్శలుచేస్తున్నారు.  ఆమె పాదయాత్ర ఎందుకు చేస్తుందనేదేది తెలియడం లేదని.. షర్మిల సీఎం కావాలనేది ఆమె కోరిక అని.. ఆమె తల్లి కూడా అదే చెప్పారు. అయితే ఏపీలో చూసుకోవాలన్నారు.  జగన్‌కు చెప్పి షర్మిలను ఏపీ సీఎం చేయాలని విజయమ్మకు సలహా ఇస్తున్నానన్నారు.   మీ ఇంటి పంచాయతీని మా మీద రుద్దకండి. ఏపీకి మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి. మూడు రాష్ట్రాలకు మీ ముగ్గురు సీఎంలు కండి. మీకు ముఖ్యమంత్రి పదవుల కోసం రెండు రాష్ట్రాలను నాశనం చేస్తారా?  షర్మిల పక్కా బీజేపీ ఏజెంట్, బీజేపీ బినామీ’’ అని జగ్గారెడ్డి  అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే షర్మిల స్పందించారు. 


టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్న షర్మిల


షర్మిల ఇటీవలి కాలంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటి విషయంలో ఇతర పార్టీల నేతలు మండి పడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగానే ఇటీవలే తన తండ్రిని కుట్ర చేసి చంపారని.. ఇప్పుడు తనను కూడా చంపడానికి కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఇలా ఘాటు విమర్శలతో షర్మిల ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. 


"రాజధాని"కే నిధులడిన ఏపీ - లెక్కలు చెప్పమన్న కేంద్రం ! ఢిల్లీ మీటింగ్‌లో జరిగింది ఏమిటంటే ?