హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం ఆదానీ- మోదీ సంబంధాల పట్ల దేశ రాజకీయాలు అట్టుడికిన నేపథ్యంలో  అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌తో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ భేటీ కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 


ఎన్సీపీ అధినేత శరత్ పవర్, ఆదాని గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇద్దరు కలిసి అహ్మదాబాద్ సనంద్ లోని ఓ గ్రామంలో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత అహ్మదాబాద్ లోని ఆయన నివాసాన్ని, ఆఫీసును శరత్ పవర్ సందర్శించారు. ఈ విషయాన్ని శరత్ పవర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాను. అలాగే వీరిద్దరూ కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి భేటీతో ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఈ విషయాన్ని శరత్ పవర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాను. అలాగే వీరిద్దరూ కలిసి ఫ్యాక్టరీని ప్రారంభించిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి భేటీతో ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.


ఏడాది ఏప్రిల్ లో శరత్ పవర్ ని ముంబైలోని ఆయన నివాసంలో గౌతం అదాని కలిసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటలపాటు వీరిద్దరు మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. అదాని సంస్థలపై హీడెన్బర్గ్ రీసెర్చ్ నివేదికపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న సమయంలోనే ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు అదాని గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి తాను ముగ్గు చూపుతున్నట్లు పవర్ ఆ సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత జూన్ లో అదాని మరోసారి పవన్ కలిశారు.


శరత్ పవర్, ఆదానీల మధ్య దాదాపు రెండు దశాబ్దాల బంధం ఉంది. 2015లో పవర్ ప్రచురించిన తన మరాటి ఆత్మకథ ' లోక్ మేజ్ సంగటి ' లో బొగ్గు రంగంలో అడుగుపెట్టిన అదానిపై పవర్ ప్రశంసలు కురిపించారు. తన పట్టుదలతోనే అదాని థర్మల్ పవర్ రంగంలోకి అడుగు పెట్టారని అందులో తెలిపారు. అంతేకాకుండా సేల్స్ మాన్ గా తన జీవితాన్ని ప్రారంభించిన దాని తన కార్పొరేట్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో పవర్ అందులో వివరించారు.


అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు పట్టుబడుతున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో గౌతమ్ అదానీ భేటీ కావడం సంచలనంగా మారింది.  ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వచ్చిన అదానీ దాదాపు రెండు గంటలకు పైగా సమావేశం అయ్యారు. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కు ప్రధాన మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీ త్వరలో బీజేపీ కూటమిలో చేరబోతోందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.


ఈ క్రమంలో తమ పార్టీ అధినేత శరద్ పవార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని అజిత్ పవార్ సైతం క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో శరద్ పవార్ తో అదానీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకు ముందు జేపీసీ కమిటీ కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టడాన్ని శరద్ పవార్ విమర్శించారు. అదానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయాలని రాహుల్ గాంధీ అనుకోవడం సరికాదని, అదానీపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.


అదానీ దేశంలో అనేక రకాల సేవలు చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ క్రమంలో అదానియే శరద్ పవార్ నివాసానికి వచ్చి భేటీ కావడంతో అదానీ, పవార్ ఏం చర్చించుకున్నారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వీరి భేటీతో శరత్ పవార్ కాంగ్రెస్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరుతారా అనే ప్రచారం ఊపందుకుంది. ఇదే జరిగితే కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఊహించని దెబ్బగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.