Telangana Local Elections  :   స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి ఉన్న ఆటంకాలు ఏమిట‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. ఇప్పటికే స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసింది. భార‌త ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి  నూత‌న ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌ని అదొక్కడే సమస్య అని అధికారులు చెప్పారు. 


మరో వారం పది రోజుల్లో ఓటర్ల జాబితాలు


ఎన్నికల సంఘం నుంచి మ‌రో వారం పది రోజుల్లో ఓటర్   జాబితాలు వస్తాయని  అధికారులు  చెబుతున్నారు.   జాబితా రాగానే వెంట‌నే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. వారంలోపే ఆయా స్థానిక సంస్థ‌ల‌కు త‌గిన‌ట్లు ఓట్ల‌ర్ల జాబితాలు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బీసీ క‌మిష‌న్ సైతం నిర్దిష్ట గ‌డువులోగా త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేసి, ఆగ‌స్టు నెల చివ‌రి వ‌ర‌కు పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. 


బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?


బీసీ కమిషన్‌కు గడువు 


ఐదేండ్ల క్రితం ఎన్నిక‌ల్లో కేటాయించిన‌ రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారమే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగస్ట్‌ నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన‌ట్లు చెబుతున్నారు. ఆగస్ట్‌ మొదటివారం లోగా కొత్త ఓటరు జాబితాను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 


రిజర్వేషన్లు మారిస్తే న్యాయపరమైన చిక్కులు 


స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి వారం రోజుల కిందట ఆదేశించారు.  ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బీహార్‌లో 2023లో కుల గణన చేశారని,  కులగణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. మొత్తానికి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కార‌మే పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు సమాచారం.  


చోరీ సొమ్ముతో షార్ట్‌ఫిల్మ్ తీసిన యువకుడు- డైరెక్టర్‌ కావాలన్న కలతో దొంగతనాలు


రాజకీయంగా కూడా కీలక నిర్ణయమే


ఏడాది చివరి లోపుస్థానిక ఎన్నికలు పూర్తి చేస్తే రాజకీయ పరమైన లక్ష్యాలను సాధించవచ్చని రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యేల చేరికల టార్గెట్ అప్పటికి పూర్తవుతుదంని.. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టవచ్చని భావిస్తున్నారు.