Priyanka Chopra Raghav Chadha News:భారత్ రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్‌గా ఉంటాయి. ఏదో విషయం సంచలనం కలిగిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ యువనేత రాఘవ్ చద్దా పార్టీ మారడం ఒక సంచలనమైంది. ఆయన ఆప్ ను వదిలేసి బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది.ఆయనతోపాటు మరొ ఆరుగురిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లారు. ఈ సంచలనంపై చర్చ జరుగుతున్న వేళ మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్దూ చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీంతో విషయంపై కొత్త చర్చ మొదలైంది.
రాఘవ్ చద్దా, ప్రియాంకపై నవజ్యోత్ కౌర్ సంచలన కామెంట్స్
నవజ్యోత్ కౌర్ సిద్దూ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ రావ్ చద్దా బీజేపీలో చేరడం వెనుక ఒక టాప్ సీక్రెట్ ఉందని అన్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం అంతర్జాతీయ నటి, వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ సలహా ఇచ్చారని అన్నారు. తన సోదరి పరిణితి చోప్రా జీవితంలో ఇబ్బందుల్లేకుండా చేయసే ఉద్దేశంతో రాఘవ్ చద్దాను బీజేపీ వైపు ప్రియాంక నడిపించారని నవజ్యోత్ కౌర్ పేర్కొన్నారు.
ఎవరికీ తెలియని విషయాలు అంటూ మాట్లాడిన నవజ్యోత్ కౌర్
రాఘవ్ చద్దా ఆప్‌లో కీలక పాత్ర పోషించినప్పటికీ గత కొంతగాలంగా పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గుతోందని వార్తలు వచ్చాయి. ఎవరికీ తెలియని ఇంకో విషయం ఉందని నవజ్యోత్ కౌర్ సిద్దూ చెప్పుకొచ్చారు. ఆప్ నేతలను టార్గెట్ చేస్తూ ఈడీ దారులు జరిగే ఛాన్స్ ఉందని, ఆ జాబితాలో రాఘవ్ చద్దా పేరు ఉందనే విషయం ప్రియాంక చోప్రాకు ముందే తెలుసు అని ఆరోపించారు. ఒక వేళ రాఘవ్ పై దాడులు జరిగితే తన సోదరి పరిణితి ఇబ్బందుల్లో పడుతుందని భావించిన ప్రియాంక, రాజకీయ మార్పు ద్వారా ఆయనను ఆ ముప్పు నుంచి కాపాడారు అని సిద్దూ వివరించారు. రాఘవ్ చద్దా ఆప్ తరఫున మాట్లాడటం లేదని, పార్టీ నాయకత్వం ఆయనపై ఆగ్రహంగా ఉందనే విషయం మాత్రమే బయటకు వచ్చిందని అన్నారు.
Also Read: వాట్సాప్‌లోనూ తెలంగాణ 10వ తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి
గత ఏడాదిన్నర కాలంగా పార్టీలో జరుగుతున్న తప్పులపై మౌనంగా ఉన్నారని, అప్పుడే గళం విప్పి ఉంటే బాగుండేదని నవజ్యోత్ కౌర్ అభిప్రాయపడ్డారు. మౌనంగా ఉండే ప్రతి వ్యక్తి పార్టీకి విధేయుడే అని అర్థం కాదని విమర్శలు చేశారు.
బీజేపీలో రాఘవ్ చద్దాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్
రాఘవ్ చద్దా నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ఆయన బీజేపీలో చేరిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లో ఫాలోవర్స్‌ను కోల్పోయారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా వ్యంగ్యంగా స్పందించారు. పోలీసులు నేరాలు ఎదుర్కోవడంలో విఫలమయ్యారని అందుకే పోలీస్ ఫోర్స్ వదిలేసి దావూద్ ఇబ్రహీంతో చేతులు కలుపుతున్నానంటూ కామెంట్ చేశారు.
