ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరించారు కానీ ఆ తర్వాత వచ్చే సమస్యలను పరిష్కరించడానికి సీఎం జగన్‌కు సమయం సరిపోవడం లేదు. ఇంకా మంత్రి పదవులు రాని వారిని బుజ్జగిస్తూనే ఉన్నారు. తాజాగా కొంత మంది మంత్రులు శాఖలపై అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది . ఈ కారణంగానే వారు బాధ్యతలు స్వీకరించలేదన్న ప్రచారం జరుగుతోంది. తమ శాఖల్లో మార్పుల కోసం వారు సీఎం జగన్‌పై రకరకాల ఒత్తిళ్లు తెస్తున్నారన్న ప్రచారంజ జరుగుతోంది.
పాత శాఖలేనే కోరుకుంటున్న కొంత మంది పాత మంత్రులు!
మంత్రి పదవులు మళ్లీ నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరకు ఎలా గొలా తిరిగి కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రులు ఇప్పుడు మరొ మెలిక పెట్టారు.రాబోయే రోజుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని సమానంగా డీల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ..శాఖల పై అభ్యంతరాలు పునపరిశీలించాలని కోరుతూ సీఎం జగన్ వద్ద పంచాయితీ పెట్టినట్లుగా తెలుస్తోంది. సీనియర్ మంత్రులు తిరిగి బాద్యతలు చేపట్టిన నేపద్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టి పరిస్దితులు పై దృష్టి సారించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. అయితే కొత్త మంత్రివర్గం కూర్పు తరువాత మంత్రులకు జగన్ కొత్తగా శాఖలను కేటాయించారు. శాఖలను మార్చడంతో సినియర్ మంత్రులకు ఇబ్బందిగా మారింది.
జగన్ చెప్పిన ఫార్ములానే కారణంగా చూపిస్తున్న పాత మంత్రులు !
పాత శాఖలను తిరిగి కేటాయిస్తే తమకు సమయం ఆదా అవుతుందని, వచ్చే రెండేళ్ళలో పార్టి కి ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలుంటుందని చెబుతున్నారు. పాత శాఖలే అయితే తాము పనిని కంటిన్యూ చేసుకోగలమని,కొత్త శాఖలయితే మెదటి నుండి అవగాహనకు వచ్చే సరికి సమయం సరిపోతుందని చెబుతున్నారు. దీని వలన అటు పార్టికి,ఇటు శాఖలకు కూడ న్యాయం చేయలేని పరిస్దితి ఏర్పడే అవకాశం ఉందని కూడ చెబుతున్నారు. పాత శాఖలను మనస్పూర్తిగా కోరుకుంటున్న మంత్రులు ఇప్పటి వరకు కూడ తమకు కొత్తగా కేటాయించిన శాఖల నుండి బాద్యతలు తీసుకోలేదు.
బొత్సదో బాధ.. బుగ్గనది మరో బాధ !
కొందరు కొత్త మంత్రులు బాధ్యతలు తీసుకోలేదు. అయితే వారికి ఎలాంటి అసంతృప్తి లేదని చెబుతున్నారు. కానీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బాధ్యతలు తీసుకోలేదు. బొత్సా సత్యనారాయణ, విద్యా శాఖ పై ఇంట్రస్ట్ గా లేరిన అంటున్నారు.అందుకనే సీఎం నిర్వహించిన సమీక్షకు కూడ హజరు కాలేదని చెబుతున్నారు.తిరిగి మున్సిపల్ శాఖ ను అప్పగిస్తే అటు పార్టికి ఇటు,శాఖకు కూడ న్యాయం చేయగలమని,వచ్చే ఎన్నికల పై ఫోకస్ పెట్టగలమని అంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తనకు ఆర్థిక శాఖ వద్దంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆర్దిక శాఖను తిరిగి కేటాయించటంతో తిరిగి బాద్యతలు స్వీకరించాలా అనే సందేహంలో బుగ్గన ఉన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన మళ్లీ అమరావతి రాలేదు.
శాఖల్లో మార్పులుంటాయని ప్రచారం !
మంత్రివర్గంలోని సీనియర్ల అభిప్రాయాలను కాదలనేని స్థితిలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బొత్సకు విద్యా శాఖ పదవి ఇవ్వడంపై సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ నడుస్తోంది. ఈ కారణంగా ఆయన శాఖను మార్చే అవకాశం ఉందని కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సచివాలయంలో ప్రచారం జరుగుతుంది.